కెమోరా రెడీ యాక్ష‌న్

లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా మూగబోయిన చిత్రసీమ మూగబోయింది. ప్రభుత్వ విధాననిర్ణయాలతో జూన్‌ మొదటివారం నుంచి మళ్లీ సందడి నెలకొనబోతున్నది. స్టార్‌కెమెరా, యాక్షన్‌…అంటూ సెట్స్‌ పూర్వకళను సంతరించుకోబోతున్నాయి. కరోనా వ్యాప్తి ని అరికట్టేందుకు కొన్ని పరిమితులు, జాగ్రత్తలతో ప్రభుత్వాలు సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణల పరంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్నది అందరిలో ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా లిప్‌లాక్‌లు, రొమాంటిక్‌ సన్నివేశాల్ని ఏ విధంగా చిత్రీకరించనున్నారనే ప్రశ్న సగటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. కరోనా కారణంగా కొంతకాలంగా లిప్‌లాక్‌, కౌగిలింతలు, ఇంటిమెట్‌ సీన్స్‌ సినిమాల్లో కనిపించవనే సంశయాలు నెలకొన్నాయి. ఈ సన్నివేశాల విషయంలో చిత్రసీమలో మళ్లీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజులకు వెళ్లిపోయి ముద్దులకు సింబాలిక్‌గా పువ్వులను చూపించడంలాంటి కెమెరా ట్రిక్‌లను ఉపయోగించే రోజులు రావచ్చని సందేహిస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఫ్లయింగ్‌కిస్‌లతోనే సరిపెట్టుకునే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. వైరస్‌ ప్రభావం నేపథ్యంలో నటీనటులు ముద్దు సన్నివేశాల్లో నటించవద్దని సింగపూర్‌ ప్రభుత్వం అదేశాలు జారిచేసింది. ఫ్రాన్స్‌, స్విట్జర్లాంట్‌ ప్రభుత్వాలు సైతం ఇదే రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చాయి. మన దగ్గర ఎలాంటి నియయాలు వస్తాయనేది సస్పెన్స్‌గా మారింది. కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ప్రస్తుతం రొమాంటిక్‌ సన్నివేశాలు, లిప్‌లాక్‌లలో నటించడానికి తారలు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.‌