ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు ఉన్నాయో తెలుసా ?

కరోనా మహమ్మారి రోజు రోజుకు కోరలు చాస్తూ ప్రపంచాన్ని కబళిస్తున్నది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకుల వణికిపోతున్నాయి. లాక్ డౌన్, భౌతిక దూరం ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా ఉధృతి పెరుగుతూనే ఉన్నది. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 49.86 లక్షలకు చేరుకున్నాయి. కరోనా కారణంగా 3.24 లక్షల మందికి పైగా మృతి చెందగా.. 19.56 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. ప్రధానంగా అమెరికాలో 15.70 లక్షలకు పైగా కరోనా బాధితులు ఉండగా 93,533 మృతి చెందారు. రష్యాలో 2.99 లక్షల మంది బాధితులు, 2,837 మంది మృతి, స్పెయిన్ లో 2.78 లక్షలకు పైగా బాధితులు, 27,778 మంది మృతి. బ్రెజిల్ లో 2.71 లక్షలకు పైగా బాధితులు, 17,983 మంది మృతి. యూకేలో 2.48 లక్షలకు పైగా బాధితులు, 35,341 మంది మృతి. ఇటలీలో 2.26 లక్షలకు పైగా బాధితులు, 32,169 మంది మృతి చెందారు.