ఆకాశ్ డిజిటల్, లాక్ డౌన్ సమయంలో డైలీ యాక్టివ్ యూజర్స్ లో నాలుగు రెట్లు పెరుగుదల గమనించింది

కోవిడ్-19 లాక్ డౌన్ ఇండియాలో ఎడ్-టెక్ సెక్టర్ అభివృద్ధిపై అధిక ప్రభావం చూపించింది. ఆకాష్ డిజిటల్ – ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) యొక్క ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫార్మ్ మరియు ప్రిపరేటరీ సెక్టర్ లో నేషనల్ లీడర్ గా నిలిచిన సంస్థ – క్రిందటి సంవత్సరంతో పోల్చి చూస్తే, ఏప్రిల్ 2020 లో డైలీ యాక్టివ్ వినియోగదారులలో నాలుగు రెట్లు పెరుగినట్లు గుర్తించింది. ఆకాష్ లైవ్ క్లాస్ వినియోగదారుల విషయంలో, ఏప్రిల్ 2019 లో ఈ సంఖ్య 6,800 ఉండగా, ఇది ఏప్రిల్ 2020 లో సుమారుగా 18,000 కు పెరిగినట్లు గుర్తించింది.
నిజానికి, గత లాక్ డౌన్ పీరియడ్ తో పోల్చి చూసినప్పుడు, విద్యార్థుల డైలీ ఎన్రోల్మెంట్స్ లో అనూహ్యమైన పెరిగుదల ఏర్పడి, ఏప్రిల్ 2020 లో ఎన్రోల్మెంట్ మూడు రెట్లు పెరుగుట జరిగింది. అలాగే ఆకాష్ ఐట్యూటర్ యాప్ లో డైలీ యాక్టివ్ యూజర్స్ విద్యార్తుల సంఖ్యలో కూడా పెరుగుదల అనూహ్యంగా కనిపించింది. ఇది మార్చి 2020 లో 7000 నుంచి అయిదు రెట్లు పెరిగి, ఏప్రిల్ 2020 లో 34,500 కు చేరింది. ఆకాష్ లైవ్ క్లాస్ యూజర్స్ మార్చి 2020 లో ఉన్న 6,300 సంఖ్య నుండి ఏప్రిల్ 2020 లో ఇది సుమారి 18,000 కు, అంటే మూడు రెట్లు పెరుగుట జరిగింది.

శ్రీ ఆకాష్ చౌదరి, డైరెక్టర్ మరియు సి.ఇ.ఒ, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఇఎస్ఎల్) ఇలా అన్నారు, “ఎఇఎస్ఎల్ కుటుంబానికి, ‘విద్యార్తులు మొదటి ప్రాధాన్యత’ అనేది ఎల్లప్పడు మా ముఖ్యమై డ్రైవ్. మా ఎడ్యు-టెక్ విద్యారంగం పొందుతున్న విశేష ఆదరణ చూస్తుంటే, మా మనస్సు ఆనందంతో ఉప్పొంగి పోతున్నది. ఈ లాక్ డౌన్ పిరియడ్ లో ఇంటి నుండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మరియు ఆ తర్వాత కూడా మా పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాము. ఈ విధంగా కోవిడ్-19 కారణంగా ఏర్పడిన విద్యారంగంలోని ఇబ్బందులను మనం సంయుక్తుంగా ఎదుర్కొంటూ, ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను.”
ఆకాష్ డిజిటల్ నుంచి ఆకాశ్ లైవ్, ఆకాష్ ఐట్యూటర్ మరియు ఆకాష్ ప్రాక్టెస్ట్ వంటి ఉత్పాదనలు లభిస్తాయి. ఆకాశ్ లైవ్ ద్వారా లైవ్ ఆన్ లైన్ క్లాసులుతో పాటు వెంటనే సందేహ నివృత్తి కూడా లభిస్తుంది, ఇలా ఇది ఆకాష్ అందిస్తున్న ఒక అత్యుత్తమ ఫ్యాకల్టీ. ఇంటి వద్ద విశ్వసనీయ కోచింగ్ కి అవకాశం లేనప్పుడు, విద్యార్థులకు ఇది అత్యంత ఉత్తమమైన మార్గం. ఆకాశ్ ఐట్యూటర్ ద్వారా ఆకాష్ ప్యాకల్టీ వారి అనుభవజ్ఞులైన లెక్చరర్లు తయారు చేసిన రికార్డు చేసిన వీడియో లెక్చర్లు వింటూ చూసి తమ సమయాన్ని బట్టి విద్యార్జన చేయవచ్చు. వీటి ద్వారా విద్యార్థులు తమ విద్యా సంబంద అనుభవాన్ని, జ్ఞానసంపదని పెంచుకుంటూ తమ ఖాళీ సమయంలో విద్యార్జన చేయవచ్చు. ఆకాశ్ ప్రాక్టెస్ట్ ద్వారా తమ కోచించ్ సెంటర్ బయట, విద్యార్థులుతో కలిసి తమ పరిజ్ఞానాన్ని ఈ విధంగా టెస్టులతో తమ సామర్థ్యం పరీక్షించుకోవచ్చు.
లాక్ డౌన్ నుంచి వినియోగదారుల సంఖ్యలో పెరుగుదల
• ఆకాష్ ఐట్యూటర్ యాప్ లో డిఎయు (డైలీ యాక్టివ్ యూజర్స్) సంఖ్య 5 రెట్లు పెరిగింది (మార్చి 2020 లో 7 వేలు నుండి ఏప్రిల్ 2020 లో 34.5 వేలు )
• మార్చి 2020తో పోల్చితే డైలీ ఎన్రోల్మెంట్స్ ఏప్రిల్ 2020 లో 3 రెట్లు పెరిగాయి (ముందు లాక్ డౌన్ కంటె )
• ఆకాష్ లైవ్ క్లాస్ వినియోగదారుల సంఖ్య 3 రెట్లు పెరిగింది (ఏప్రిల్ 2019 లో 6.8 వేల నుండి ఏప్రిల్ 2020 లో సుమారు 18 వేలు )

ఆకాష్ డిజిటల్ జెఇఇ, ఎన్.ఇ.టి మరియు గ్రేడ్ 8-12 స్కూల్, బోర్డ్ మరియు పోటీ పరీక్షలు కొరకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇంటి సౌకర్యంతో నాణ్యమైన కోచింగ్ అందజేస్తున్నది. ఈ ఎడ్యు-టెక్ ప్లాట్ ఫార్మ్ లైవ్ ఆన్ లైన్ క్లాసులు, రికార్డ్ చేసిన వీడియో లెక్చర్లు మరియు ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా ఆకాష్ ఇన్ స్టిట్యూట్ యొక్క అకడమిక్ లెగసీ మరియు డిస్ప్లిన్ ని మీ ఇంటికి తీసుకు వస్తున్నది. ఉత్కృష్టమైన విద్య కోరుకున్నా సరే, భౌగోళిక మరియు ఆర్థిక కారణాల వలన దానిని పొందలేక పోతున్న విద్యార్థులకు ఇది అద్భుతమైన శక్తి సామర్త్యాలు అందిస్తుంది.
ఆకాష్ డిజిటల్ అందించే విశిష్టతలు
• ఉత్కృష్టమైన నాణ్యత మరియు విశిష్ట రిసెర్చ్ ఆధారిత స్టడీ మెటీరియల్
• ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా రెగ్యులర్ అసెస్మంట్
• క్లాసు లో మరియు ఆ తర్వాత క్విక్ డబుల్ రిజల్యూషన్