మార్కెట్లు భారీగా పతనం

ఆర్థికస్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వ చర్యలు పెట్టుబడిదారులను ఏమాత్రం మెప్పించలేకపోయినందున మార్కెట్లు భారీగా పతనమయ్యాయి

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

భారతీయ స్టాక్ మార్కెట్లలో, ఎస్ & పి బిఎస్ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 లు 3% పైగా పతనం కావడంతో భారీ పతనానికి గురయ్యాయి. ట్రేడింగ్ సెషన్ ముగింపులో 30-షేర్ సెన్సెక్స్ 1076.97 పాయింట్లు లేదా 3.46% పతనం తరువాత 30020.76 పాయింట్ల వద్ద ముగిసింది. 50-షేర్ల నిఫ్టీ కూడా అదే రకంగా పడిపోయి, 313.60 పాయింట్లు లేదా 3.43% తగ్గి 8823.25 పాయింట్ల వద్ద ముగిసింది.

గతవారం ప్రభుత్వం, ఆర్థిక పరిస్థితి కోసం రూ., 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజి ప్రకతించినది మరియు అప్పటి నుండి స్టాక్ మార్కెట్లు నిరంతర పతనానికి దారితీసాయి, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పెట్టుబడిదారుల సెంటిమెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపే సంకేతాలను అందించాయి.

నానాటికీ పెరుగుతున్న మహమ్మారి వ్యాప్తి కారణంగా, ప్రభుత్వం, మార్చి 25 న లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి, నాలుగవ దశలోకి ప్రవేశించిన ఈ లాక్ డౌన్ దేశవ్యాప్తంగా విస్తరించడం అనేది, స్టాక్ మార్కెట్లలో ప్రతికూల సెంటిమెంట్ కొనసాగడానికి మరొక కారణమయింది. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి మరియు బజాజ్ ఈరోజు ప్రధానంగా ఆర్థికంగా ఎక్కువ నష్టాలను చవిచూసాయి.

బెల్వెథర్ స్టాక్ ఆర్‌ఐఎల్ తన జనరల్ అట్లాంటిక్ ఒప్పందంతో ఈ రోజు ఒక పెద్ద పునఃప్రవేశం చేసింది, ఇది మునుపటి ముగింపు వాణిజ్యం నుండి వాటా లాభం 2% కి దగ్గరగా ఉంది. కంపెనీ తన డిజిటల్ యూనిట్‌లోని 1.34% వాటాను గ్లోబల్ ఈక్విటీ ఎంటర్ప్రైజ్ జనరల్ అట్లాంటిక్‌కు 6,598.38 కోట్లకు విక్రయించినట్లుగా ప్రకటించింది. అయితే, ఈ స్టాక్ రూ. 21.25 లేదా 1.46% గా తడబడి తగ్గిపోయి, రూ. 1,438.15, వద్ద ముగిస్తింది

వెలుగు లోనికి రక్షణ స్టాక్స్; 10% వరకు పెరుగుదల

ప్రభుత్వం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల సడలింపును ప్రకటించిన తరువాత సోమవారం ప్రారంభ వాణిజ్యంలో రక్షణ సంస్థల వాటాలు 10% వరకు పెరిగాయి. ఈ రంగంలో విదేశీ సంస్థలను ఆకర్షించడానికి, మంత్రిత్వ శాఖ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ కింద 74% మంజూరు చేయడం ద్వారా రక్షణ విభాగంలో తయారీ సౌలభ్యాన్ని ప్రకటించింది.

ప్రధాన లాభాలను నమోదు చేసిన స్టాక్స్ లో తాల్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ .8.55 లేదా 7.68% పెరిగి రూ. 119.90గా ముగిసింది. వెలుగులోకి వచ్చిన మరో స్టాక్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 21.80 లేదా 4.16% పెరుగి రూ. 545.30 గా ముగిసింది.

సోమవారంరోజున, మునుపటి వాణిజ్య ముగింపుతో పోలిస్తే, మార్కెట్ ధోరణిని బట్టి, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు, 5.53%, భారత్ డైనమిక్స్ 4.71% పెరిగాయి మరియు ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ బిఎస్ఇలో 4.93% పెరిగింది.

బ్యాంకింగ్ స్టాక్స్ కొట్టుమిట్టాడుతున్నాయి

ఈ రోజు ట్రేడింగ్ లో అనేక రంగాల సూచికలు నష్టాలను నమోదు చేయగా, బ్యాంకింగ్ రంగ వాటాల నష్టాలు ఈ రోజు సెన్సెక్స్‌లో మరీ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 12 నెలలకు దివాలా మరియు దివాలా స్మృతి కింద తాజా దివాలా కేసులను దాఖలు చేయడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత, బ్యాంకుల నిరర్థక ఆస్తులపై బ్యాంకింగ్ స్టాక్స్ పెట్టుబడిదారుల ఆందోళనలు వ్యక్తమవడంతో భారీ  అమ్మకాలను చవిచూశాయి.

ప్రైవేటు రంగ ఋణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలువలో 5.56 శాతం పడిపోగా, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్ప్ తన విలువలో 7.42 శాతం కోల్పోయింది. ఈ రోజు ఒత్తిడికి గురైన ఇతర బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్, 3% నుండి 7% శ్రేణిలో నష్టాలతో ముగిసాయి.