మెదక్ జిల్లాలో భవన నిర్మాణాలకు అనుమతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలు చేసేందుకుగాను టి ఎస్ బి పాస్ ద్వారా అనుమతులు ఇస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .నూతన మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం ఇకపై తక్షణమే టి ఎస్ బి పాస్ ద్వారా భవన నిర్మాణాలు, లే అవుట్ లకు అనుమతి పొందవచ్చని పేర్కొన్నారు. టి ఎస్ బి పాస్ ద్వారా భవన నిర్మాణాలకు సులభతరంగా అనుమతులు లభిస్తాయని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా 75 చదరపు గజాల వరకు నామమాత్రపు అనుమతులు తీసుకోవడం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మొదటి అంతస్తు కు ఇలాంటి అనుమతులు అవసరం ఉండదని స్పష్టం చేశారు . ఈ వీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ , ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.