తెరాస ఎంపీ సంతోష్ అన్న పిలుపుకి విశేష స్పందన : ఉప్పల శ్రీనివాస్ గుప్త
రాజ్యసభ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ గారి పిలుపుకి విశేషమైన స్పందన వస్తోంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. టీఆరెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు గారు ఈనెల 10వ తేదీ నుండి బత్తాయి పండ్ల పంపకం కొనసాగిస్తున్నారు.. మరోవైపు ఉప్పల ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు 53వ రోజుకు చేరుకున్నాయి అని తెలిపారు. అలాగే ఉప్పల ఫౌండేషన్ 2వేలమందికి అన్నదానం, బత్తాయి పండ్లు, మాస్కుల పంపిణీ చేశామని వెల్లడించారు. మలక్ పేట్, సైదాబాద్, దిల్ సుఖ్ నగర్, నాగోల్ తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లు, క్లీనర్లకు, పారిశుద్ధ్య కార్మికులకు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కార్మికులకు, నిరుపేదలకు, ఆటో డ్రైవర్లకు మొత్తం 2వేలమందికి బిర్యానీ ప్యాకెట్లు, మాస్కులతోపాటు, బత్తాయి పండ్లు పంచారు. అలాగే వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్ కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్ కు, మనుసురాబాద్ లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు భోజనాలు, మాస్కులు, బత్తాయి పండ్లు అందించారు. మరోవైపు కరోనాపై పోరు చేస్తున్న పలువురు జర్నలిస్టులు, పోలీసు సిబ్బందికి కరోనా సేఫ్టీ మాస్క్, గ్లోవ్స్, శానిటైజర్ గల కరోనా కిట్లను అందించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఐవీఎఫ్ నాయకులు అన్నదానం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో ఐవీఎఫ్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొంటున్నారు.