తెలంగాణ, ఏపీ నీళ్ల యద్ధం

ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 203 జిఓ పై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ కు ఇరిగిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజత్ కుమార్ లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టం ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుండి 3 టీఎంసీల నీటి తరలించేందుకు ప్రయత్నిస్తోంది.దీనికోసం 203 జీవో జారీ చేసింది.ఈ జీవో పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది లేఖలో పేర్కొన్నారు. ఏపీ శ్రీశైలం నుండి కొత్త లిఫ్ట్ స్కింను ఏర్పాటు చేయడం అన్యాయం అన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన అడ్మినిస్ట్రేషన్ జీవో అక్రమం పేర్కొన్నారు. కేఆర్ ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతితోనే ఏ ప్రాజెక్ట్ అయిన మొదలు పెట్టాలి తెలిపారు. దీనిపై కృష్ణ నది యాజమాన్య బోర్డ్ వెంటనే చర్యలు చేపట్టండి. టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని కోరారు.