ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన SBI జనరల్‌ ఇన్సూరెన్స్

ప్రామాణిక ఆరోగ్య బీమా పథకం – ఆరోగ్య సంజీవని ఆరోగ్య బీమా పథకాన్ని SBI జనరల్‌ ఇన్సూరెన్స్ ప్రారంభించింది. ఈ పాలసీ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు భారతదేశవ్యాప్తంగా హాస్పిటలైజేషన్‌ కవర్‌ అందిస్తుంది.
“ఈ ఆరోగ్య సంజీవని పథకాన్ని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) సూచనల మేరకు రూపొందించడం జరిగింది. ఇది సరసమైన ప్రీమియంతో ప్రామాణిక కవరేజ్‌ అందిస్తుంది. దేశంలో ఆరోగ్య బీమాను పెంచాలన్న నియంత్రణా సంస్థ లక్ష్యాలను ఇది సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. నమ్మకమైన బ్రాండ్‌ పేరు SBIతో పాటు మాకున్న విస్తృతమైన తిరుగులేని పంపిణీ వ్యవస్థతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ విజయవంతంగా ఈ పథకాన్ని అందించగలం. మా పంపిణీ వ్యవస్థలన్నింటినీ ద్వారా ఈ ఉత్పత్తి అందుబాటులో ఉండేలా మేము చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు SBI జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ & సీఈఓ పుషాన్‌ మహాపాత్ర..

“ఈ పాలసీ ద్వారా మరింత మంది ఖాతాదారులను బీమా పరిధిలోకి తీసుకురాగలమని మేము భావిస్తున్నాం. SBI జనరల్‌ అందిస్తున్న ఇతర ఆరోగ్య పథకాలైన ఆరోగ్య ప్రీమియర్‌, ఆరోగ్య ప్లస్‌, ఆరోగ్య టాప్‌ అప్‌తో పాటు ఆరోగ్య సంజీవనిని కూడా అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం” అని ఆయన అన్నారు.

కొవిడ్‌-19 ఆస్పత్రి చికిత్స ఖర్చును కూడా ఈ ఆరోగ్య సంజీవని పాలసీ కవర్‌ చేస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఇది సాయపడుతుంది.
ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఖాతాదారులు SBI జనరల్‌ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్‌ – https://www.sbigeneral.in/portal/ ను సందర్శించవచ్చు.