12 నుంచి పట్టాలెక్కనున్న 15 రైళ్లు
చాలా కాలం తరువాత దేశ ప్రజలకు మరో తీపి కబురు చెపింది రైల్వే శాఖ. మే 12వ తేదీ నుంచి రైల్వేశాఖ తన సేవలను క్రమంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జతల రైళ్లను సాధారణ ప్రయాణికులు ప్రయాణించడానికి ఉపయోగించనున్నారు. ఈ రైళ్లు ఢిల్లీ స్టేషన్ నుంచి దిబ్రుగా, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబైసెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముకశ్మీర్, తావిల మీదుగా ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. కోవిడ్-19 కేర్ సెంటర్ల కోసం 20,000 బోగీలను రిజర్వ్ చేసిన అనంతరం అందుబాటులో ఉన్న కోచ్‌ల ఆధారంగా ఈ 15 సర్వీసులు రైల్వేశాఖ తన సేవలను ప్రారంభించనుంది. ఈ రైళ్లలో రిజర్వేషన్ బుకింగ్ మే 11వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసి ఉంటాయి. ప్లాట్‌ఫాం టికెట్లు కూడా ఇవ్వరని అధికారులు తెలిపారు. చెల్లుబాటు అయ్యే టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతి ఇస్తారు. స్టేషన్‌లలో స్క్రీనింగ్ చేసిన అనంతరం వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులకు మాత్రమే రైళ్లలో ఎక్కడానికి అనుమతి ఉంటుంది.