A సర్టిఫికెట్ ఉంటేనే తెలుగు చానెల్స్ లో చర్చలు

తెలుగు చానల్స్ లో జర్నలిస్టులకు A సర్టిఫికెట్ ఉంటేనే చర్చా వేదికలు నిర్వహించే అవకాశం ఉంటుందా ? A అంటే ఆంధ్రా వారు, ఆంధ్రా నేపథ్యం అనే ముద్ర ఉండాలి ? కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణా వచ్చి ఆరేళ్ళు ఐనా తెలంగాణాలో పోటు జర్నలిస్టులు అనుకునే వారికి కూడా ఛాన్స్ రాలేకపోతుంది. A సర్టిఫికెట్ ఉన్న జర్నలిస్టులు లేకుంటే ఆఖరికి A సర్టిఫికెట్ ఉన్న యాంకర్ కైనా అవకాశం ఇస్తారు కానీ జర్నలిజం విలువలు తెలిసి మంచి వాక్చాతుర్యం ఉన్నవారికి మాత్రం అన్ని ప్రధాన ఛానెళ్లలో అవకాశం లేకుండా పోతోంది. A సర్టిఫికెట్ ఉంటే చర్చల్లో బూతులు తిట్టినా,జైలుకు వెళ్లి వచ్చినా ,ఆంధ్రా బాబులు ఫోన్ చేయగానే అందలం ఎక్కిస్తారు. కానీ తెలంగాణా నేపథ్యం ఉన్న పోటు జర్నలిస్టు కూడా పనికి రాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ అణిచివేతలు ?, తెలంగాణలో పని చేస్తున్న జర్నలిస్టులకు అవకాశాలు ఇవ్వక పోవడానికి గల కారణాలు ఏంటో ఎప్పటికి అర్ధం కావడం లేదు.