ఔరంగాబాద్‌లో ఈ ఉదయం మరో విషాదం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శుక్రవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం. రైల్వే ట్రాక్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లిన ఘటనలో దాదాపు 17 మంది మృతి. మృతుల్లో చిన్నారులు .
కర్మద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జౌరంగాబాద్-జల్నా మార్గంలో ఈ ప్రమాదం. లాక్‌డౌన్ వల్ల పలువురు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో.. రైల్వే ట్రాక్‌లపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే బాధిత కూలీలు రైల్వే ట్రాక్‌పై నిద్రించినట్టుగా సమాచారం.
ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే శాఖ అధికారులు, సహాయక బృందాలు. జరగిన ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశం











