దేశంలో మరో ఫ్లూ

దేశంలో మరో ఫ్లూని గుర్తించారు అధికారులు. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో సుమారు 2500 పందుల మృతి చెందాయి. భోపాల్‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీసెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) నిర్ధారించింది. 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పందుల జనాభా 21 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 30 లక్షలకు చేరింది.