బంగ్లాదేశ్, భారత్‌కన్నా ఆర్థికంగా బలంగా ఉంది
కరోనా కష్టకాలంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఆర్థికంగా భారత్‌కన్నా బలంగా ఉంది. చైనా కన్నా కూడా దృఢంగా ఉంది. ‘ది ఎకానమిస్ట్’ పత్రిక జరిపిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడయింది. కరోనా కారణంగా ఏ దేశం ఎంత బలంగా ఉందనే విషయాన్ని ఈ పత్రిక అధ్యయనం చేసింది. మొత్తం 66 అభివృద్ధి చెందుతున్న దేశాల తీరును పరిశీలించింది. జాతీయ స్థూల ఉత్పత్తి (జిడీపీ)లో రుణాల శాతం, విదేశీ రుణాల మొత్తం, వడ్డీల భారం, నగదు నిల్వ…ఈ నాలుగు అంశాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని అంచనా వేసింది. ఇందులో బంగ్లాదేశ్‌కు 9వ స్థానం లభించింది. మొదటి స్థానాన్ని బోత్స్వానా దక్కించుకొంది. చిట్టచివరి స్థానంలో బ్రెజిల్ ఉంది. భారత్‌కు 18, పాక్‌కు 43, శ్రీలంకకు 61 స్థానాలు లభించాయి.