160 కోట్ల మంది ఉద్యోగాలు డౌటేనా ?
ప్రపంచవ్యాప్తంగా అనుకున్నది అంతా అయేటట్టుగానే ఉంది. అందుకు సర్వేలు కూడా ఆవే వాస్తవాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. కరోనా వైరస్ వల్ల ఈ దుస్థితి సంభవించే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ వార్నింగ్ ఇచ్చింది. సుమారు 160 కోట్ల మంది అసంఘటిత కార్మికులు తీవ్ర ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. రిటేల్, ఉత్పత్తి, ఫుడ్ సర్వీస్ పరిశ్రమల్లో కోవిడ్19 ప్రభావం ఎక్కుగా ఉంటుందని ఐఎల్‌వో పేర్కొన్నది. ఇప్పటికే సుమారు 200 కోట్ల మంది అసంఘటిత కార్మికుల వేతనాలు ప్రపంచవ్యాప్తంగా 60 శాతం పడిపోయాయినట్లు ఐఎల్ఎం అభిప్రాయపడింది. లక్షలాది మంది కార్మికులకు పని లేదని, అంటే వారికి ఆదాయం లేకుండా తిండి కూడా ఉండదని, భద్రత-భవిష్యత్తు కూడా కష్టమే అని ఐఎల్వో చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు శ్వాస పీల్చుకోలేకపోతున్నట్లు ఐఎల్వో డైరక్టర్ జనరల్ గయ్ రైడర్ తెలిపారు. అసంఘటిత కార్మికులకు పొదుపు ఖాతాలు కానీ, క్రిడెట్ కార్డులు కానీ ఉండవన్నారు. ఒకవేళ మనం ఇప్పుడు వారిని ఆదుకోలేకపోతే, ఇక వాళ్లు కనుమరు అవ్వడం ఖాయమని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల 31 లక్షల మందికి వైరస్ సంక్రమించింది. సుమారు 2.20 లక్షల మంది మరణించారు.