ఇంట్లో ఉండి పరీక్షలు రాయండి
ఐఐటీ, నీట్, ఎన్‌టీఎస్ఈ కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు అత్యుత్తమ అనుసంధానిత అనుభవాలను అందించడంతో పాటుగా తమ కలలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేస్తున్న విద్యార్థులకు సహాయపడేందుకు అనుకూల అభ్యాస సాంకేతికతను మిళితం చేసుకున్న కృత్రిమ మేథస్సు (ఏఐ) ఆధారిత ఆన్‌లైన్ పరీక్షను లెర్నింగ్ ట్రీ పరిచయం చేసింది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు అనుకరణ వాతావరణంలో పరీక్షలకు హాజరయ్యేందుకు వేదికను ఇది అందిస్తుంది. ఈ పరీక్షలను నిపుణులు సృష్టించారు. ఈ పరీక్షలు అభ్యాసకులు ఆయా అంశాలపై తమ విషయ పరిజ్ఞానం, సన్నాహాకతను పరీక్షించుకునేందుకు తోడ్పడతాయి. ఈ వేదిక సమయపాలన, బలం, వేగం, ఖచ్చితత్త్వం, ప్రేరణ, టాపిక్ స్ట్రెంగ్త్, ఎలిమినేషన్ సహా ఏఐ ఆధారిత ఎనలిటిక్స్‌ను ఉపయోగిస్తుంది. ఏఐ సాంకేతికత ద్వారా ప్రతి విద్యార్థి పురోగతి సాధించడానికి మరియు వారి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి అవకాశమివ్వడానికి లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంలో మెషీన్ లెర్నింగ్ ఆధారితమైన అనుకూల అభ్యాస ఇంజిన్ ఉంది. ఇది వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను వ్యక్తిగత ప్రాధాన్యతలు, అభ్యాస శైలి మరియు ప్రాధాన్యతలను ఆధారంగా అందిస్తుంది.
కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు పలు రంగాలు పనిచేయకుండా అడ్డుకోవడం కారణంగా పలు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆందోళనలను తగ్గించేందుకు లెర్నింగ్ ట్రీ ఇప్పుడు ప్రిపరేషన్ , ప్రాక్టీస్ మరియు పరీక్ష ఇవాల్యుయేషన్ సమస్యలను పరిష్కరించేందుకు ఏకీకృత పరిష్కారం అందిస్తుంది. ఈ సిమ్యులేషన్ పరీక్ష కోసం ఒక్కో విద్యార్థి 500 రూపాయల చందా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో www.LearningTree.AI వద్ద నమోదు చేసుకున్న విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
ఈ నూతన అభ్యాస విధానం గురించి శ్రీ శశికాంత్ వల్లెపల్లి, సీఈవో, లెర్నింగ్ ట్రీ నెక్ట్స్‌జెన్ మాట్లాడుతూ “తరువాత తరం వేదిక లెర్నింగ్ ట్రీ. ఇది విద్యార్థులకు సంపూర్ణమైన అభ్యాస అనుభవాలను అందించనుంది. లెర్నింగ్ ట్రీ ఎలాంటి క్లిష్టత లేకుండా లీనమయ్యే అభ్యాస సాంకేతికతను అనుకూల అభ్యాసంతో ఎలాంటి క్లిష్టత లేకుండా మిళితం చేయడంతో పాటుగా విద్యార్థులకు అత్యుత్తమ అనుసంధానిత అనుభవాలను అందిస్తుంది. లెర్నింగ్ ట్రీ డాట్ ఏఐ ద్వారా విద్యార్థులు ఐఐటీ/జెఈఈ, నీట్ మరియు ఎన్‌టీఎస్ఈ కోసం మాక్ టెస్ట్‌లను తీసుకోవడం ద్వారా తామెంతగా పరీక్షలకు సిద్ధమైనదీ పరీక్షించుకోవచ్చు. ఈ మాక్ పరీక్షలను మొత్తం పోటీ పరీక్షల సిలబస్‌ను కవర్ చేసే రీతిలో తీర్చిదిద్దారు. ఇది విద్యార్థులకు సమయపాలన మరియు కాన్సెప్ట్యువల్‌గా సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత తెలుసుకునేందుకు దోహదపడుతుంది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా అతి కీలకమైన పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. అందువల్ల, మేము విద్యార్థులను నమోదుచేసుకోవడంతో పాటుగా ఉచిత చందా ప్రయోజనాలు పొందవలసినదిగా మరియు తమ మేథస్సును పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ మాక్‌టెస్ట్‌లు www.LearningTree.AI వద్ద లభ్యమవుతాయి…” అని అన్నారు.
ఆయనే మరింతగా చెబుతూ “విద్యార్థుల యొక్క జ్ఞానం, అవగాహన, సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ ఉత్పత్తికి తగిన సామర్థ్యం ఉందని లెర్నింగ్ ట్రీ నెక్ట్స్ జెన్ వద్ద మా బృందం విశ్వసిస్తుంది. భారతదేశంలో, ఆన్‌లైన్ తరగతులు/ ఆన్‌లైన్ పరీక్షలు ప్రసుతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్‌లైన్ ప్రోక్టోరెడ్ ఎట్ హోమ్ ఎగ్జామ్ సొల్యూషన్‌ను తమ విద్యార్థులకు కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా సాధారణ పరీక్షల నిర్వహణ కష్టమైన వేళ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలనుకునే యూనివర్శిటీ/ఇనిస్టిట్యూషన్‌ల కోరికలకనుగుణంగా తీర్చిదిద్దే రీతిలో డిజైన్ చేయడం జరిగింది..” అని అన్నారు.