కరోనా మరణాలు నిజామా అబద్దమా ?
తెలంగాణాలో కరోనా పాజిటివ్ , మరణాల మీద ప్రతిపక్ష విపక్షాల మధ్య రాజకీయం జరుగుతుందా ? అనే అంశం ఇప్పుడు రాజకీయ పార్టీలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో వాస్తవాలు , అవాస్తవాలు ప్రజలకు తెలవాలి అంటే తప్పకుండ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విపక్షాలు పట్టు పడుతున్నాయి. తెలంగాణాలో నిజానికి 25 మందే చనిపోయారా లేదా ఇంకా ఎక్కువ మంది చనిపోయారా అనేది సందేహంగా ఉంది. కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు 26 మంది చనిపోయారు అని చెబుతున్నారు. మరో వైపు పేరు ప్రతిష్టల కోసం కరోనా కేసులు పెరగకుండా పరీక్షలు చేయడం లేదు అనేది మరొక ఆరోపణ ప్రభుత్వం మీద చేస్తున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుకిగా బాధ్యతలు చేపట్టిన ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతు కరోనా పరీక్షలు ఆపడంతో కేసుల సంఖ్య తగ్గింది. ఐసీఎమ్‌ఆర్ ఎక్కడా పరీక్షలు తగ్గించమని చెప్పలేదు. మృతదేహాలకు కూడా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎలా ఇస్తారు. డీఎమ్‌ఈ సర్కులర్ ఎలా జారీ చేస్తారు ? రికార్డుల కోసం, రివార్డుల కోసం ప్రభుత్వం పనిచేస్తుంది. వైరస్ మహమ్మారిని తగ్గించడానికి ప్రభుత్వం పనిచేస్తుందా? పేరు కోసం పరీక్షలు చేయడం ఆపేస్తారా? అఖిల పక్షం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ముందుకు వెళ్తుంది. కేంద్రం ఇచ్చే రిపోర్టుల్లో రాష్ట్రంలో 26 మంది చనిపోయినట్లు ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం 25 మంది చనిపోయినట్లు చూపెడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులను ప్రభుత్వం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది?’ అని బండి సంజయ్ అన్నారు.