కోవిడ్-19 షట్ డౌన్ మధ్య విద్యార్థుల సహాయం కోసం మెరిట్ నేషన్ 6-12 గ్రేడుల కొరకు ఆన్ లైన్ లైవ్ క్లాసులు ఉచితంగా అందిస్తున్నది

  • లాక్ డౌన్ నుండి యాప్ ఇన్ స్టాల్స్ లో 400% అభివృద్ధి.
  • లాక్ డౌన్ నుండి స్టూడెంట్స్ లక్ష గంటలకు పైగా లైవ్ క్లాసులుకు హాజరు అయ్యారు.
  • ఇప్పటి వరకు ఫ్రీ లైవ్ క్లాసెస్ కోర్సు లో 1.4 లక్ష స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు.
  • మెరిట్ నేషన్ ఫ్రీ యాప్ ద్వారా లైవ్ క్లాసులు కూడా యాక్సెస్ చేయవచ్చు.

 కోవిడ్-19  విస్ఫోటం మరియు దాని ప్రబావంగా ఏర్పడిన అస్థిరత కారణంగా, ఇండియా లో స్కూల్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూట్స్ మీద తీవ్రమైన ప్రభావం పడింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, టెస్ట్ ప్రిపరేటరీ లీడర్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) యొక్క అనుబంధ సంస్థ మరియు ఇండియన్ ఎడ్ టెక్ మేజర్ మెరిట్ నేషన్స్, ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు తమ స్టడీస్ కొనసాగించుటకు వీలుగా సహకరిస్తూ, స్పెషల్ ఫ్రీ లైవ్ క్లాసులు నిర్వహిస్తున్నది.

మెరిట్ నేషన్స్ 6-12 గ్రేడ్స్ స్టూడెంట్స్ కొరకు, రుసుము లేకుండా, లాక్ డౌన్ లిఫ్ట్ చేసే వరకు లైవ్ క్లాసులు మరియు స్టడీ రిసోర్సుల మొత్తం రేంజ్ ని అందిస్తున్నది. మెరిట్ నేషన్స్ అందజేస్తున్న ప్రీమియమ్ స్టడీ రిసోర్సులలో చేరినవి:

  • కాన్సెప్ట్స్ వివరిస్తూ వీడియోలు మరియు యానిమేషన్స్
  • విద్యార్థులకు విలువైన  పరిపూర్ణ అవగాహన కలిగించే వివిద టెస్టులు మరియు స్మార్ట్ రిపోర్టులు
  • నిపుణుల ద్వారా ఆన్సర్ చేయబడిన 40 లక్షల ప్రశ్నల డేటా బ్యాంకు కి యాక్సెస్
  • సులభమైన రిఫరెన్సులకు టెక్స్ట్ మరియు డౌన్ లోడ్ చేస కోదగిన రివిజన్ నోట్స్ కి సపోర్ట్
  • NCERT మరియు ఇతర పాఠ్య పుస్తకాల కొరకు సొల్యుషన్లు

మెరిటి నేషన్స్, జెఇఇ / ఎన్ఇఇటి కి కూర్చొనేందుకు తయారౌతున్న విద్యార్థుల కొరకు కూడా లైవ్ క్లాసులు నిర్వహిస్తున్నది, ఎలాంటి ఛార్జీలు లేకుండా. అదనంగా,  మెరిట్ నేషన్స్ అందించే ఫ్రీ లైవ్ క్లాసుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు – www.meritnation.com/liveclass

శ్రీ పవన్ చౌహాన్మెరిట్ నేషన్ ఫౌండర్ మరియు సిఇఒ విజయాన్ని సాధించుటకు అడాప్ట్ చేసుకునే సామర్థ్యం ముఖ్యం అని విశ్వసిస్తారు. “ఇండియా అంతటా అధిక సంఖ్యలో విద్యార్థులు ఆన్ లైన్ లో చదువుటకు ముందుకు వస్తున్నారు, ప్రతి రోజూ చేరుతున్న వేలాది విద్యార్తులతో మా లైవ్ క్లాసుల జనాదరణ క్షణక్షణం పెరుగుతూ ఉన్నది. విద్యార్థులు ఆన్ లైన్ లెర్నింగ్ కాన్సెప్ట్ కు చక్కగా అలవాటు పడుతున్నారని దీని ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది. లాక్ డౌన్ రద్దు చేసే వరకు మెరిట్ నేషన్ సంస్థ తమ ప్లాట్ ఫార్మ్ మీద ఫ్రీ లైవ్ క్లాసులు అందించుట కొనసాగిస్తుంది, స్టూడెంట్స్ తమ ఇంటి సంరక్షణలో ఉంటూ స్టడీ చేయుటకు కావలసిన సహాయం అంతా నిశ్చయంగా వారికి అందజేస్తుంది. ఉపాధ్యాయులు అందరు, విద్యార్థులకు కావలసిన సహాయం అందించుట కొరకు మెరిటి నేషన్ కు చేరుకోగలరు”, అని ఆయన న్నారు.

శ్రీ ఆకాష్ చౌదరిడైరెక్టర్ మరియు సి.ఇ.ఒఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) ఇలా అన్నారు, “ఎఇఎస్ఎల్ ఫ్యామిలీకి ‘స్టూడెంట్స్ ఫస్ట్’ అనేది ఎల్లప్పుడు మా మొదటి కీ డ్రైవ్. ఇంటి నుంచి విద్య ను కొనసాగిస్తున్న విద్యార్థులకు సపోర్ట్ అందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మన టెక్ ప్లాట్ ఫార్మ్ విచ్ఛేదన కోవిడ్ 19 వైరస్ ద్వారా ఏర్పడిన విద్యారంగంలోని విచ్ఛేదనపై విజయం సాధించాలని ఆశిద్దాం.”

మెరిట్ నేషన్ యొక్క ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ లైవ్ క్లాసులు యాక్సెస్ చేయవచ్చు. ఇది విద్యార్థి సముదాయాన్ని అత్యంత వేగంగా ఆకర్షిస్తూ ఉంది. మెరిట్ నేషన్ యొక్క ఫ్రీ  లైవ్ క్లాస్ కోర్స్ యొక్క ఒక విద్యార్థి యష్ వర్ధన్ ఇలా అన్నారు, “కోవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో, ఈ యాప్ ద్వారా నా స్టడీస్ చాలా సౌకర్యవంతంగా మారాయి. “

ఇండియాలో ప్రముఖ ఎడ్యుకేషనల్ ఇంస్టిట్యూట్ అయిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్, కె12 స్టూడెంట్స్ కి సేవలు అందిస్తున్న ఎడ్-టెక్ కంపెనీ మెరిట్ నేషన్స్ ని సంగ్రహణ చేసింది,  జనవరి 2020 లో ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ తో డెఫినిటివ్ అగ్రిమెంట్ చేసుకుని, యాపిలెక్ట్ లెర్నింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంగ్రహణ చేసింది.