అది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

తెలంగాణాలో కరోనాని కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్లాస్మా థెరపీ తెర మీదకి వచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పని మరింత సులువుగా మారింది. అయితే ఇందుకు కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా అవసరం ఉంది. ఇందుకు ఆ ప్లాస్మా ఇవ్వడానికి కొంత మంది సిద్ధంగా ఉన్నారు అని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా సోకి అనంతరం కోలుకున్న ఢిల్లీకి చెందిన 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు ఎంపీ తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు.