మోదీకి సలహా ఇచ్చిన సోనియా గాంధీ

లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా కంపెనీలను( (ఎంఎస్ఎంఈ) ఆదుకునేందుకు ఐదు సూచనలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోనియా గాంధీ శనివారం లేఖ రాశారు. లాక్ డౌన్ వల్ల దేశంలో 6.3 కోట్ల ఎంఎస్ఎంఈలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని, వాటిని ఆదుకోవాలని కోరారు.ఎంఎస్ఎంఈ రంగం రోజుకు రూ.30 వేల కోట్ల వరకు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ రంగంలోని 11 కోట్ల మంది ఉద్యోగులు తమ జీవనోపాధిని కోల్పోయే అవకాశం ఉందని భయపడుతున్నట్లు తెలిపారు.
సోనియా గాంధీ 5 సూత్రాల ప్రణాళిక
1ఎంఎస్ఎంసీ వేజ్ ప్రొటెక్షన్ కోసం రూ.లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించాలి.
2 రూ.లక్ష కోట్ల క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఈ రంగంలో నగదు లభ్యత, పెట్టుబడులు అందుబాటులో ఉంటుంది.
3 భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చేపట్టిన చర్యలు వాణిజ్య బ్యాంకులలో కచ్చితంగా అమలు చేసేలా చూడాలి. ఎంఎస్ఎంఈలకు సకాలంలో సులువుగా, తగినంత రుణం లభించే విధంగా చర్యలు తీసుకోవాలి.

  1. ఆర్బీఐ ప్రకటించినట్టు మూడు నెలల వరకే కాకుండా ఎంఎస్ఎంఈలు తీసుకున్న రుణాలపై మారటోరియంను పొడిగించాలి. ఎంఎస్ఎంఈలకు కొన్ని పన్ను మినహాయింపులు లేదా తగ్గింపులు కల్పించాలి.
  2. ఎంఎస్ఎంఈలకు లోన్లు రావాలంటే భారీ ఎత్తున కొలేటరల్ సెక్యూరిటీ చూపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు కాబట్టి, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి దీనికో పరిష్కార మార్గం చూపాలి.