ప్రగతి భవన్ లో సీఎం సమీక్షా

ప్రగతి భవన్ లో కోవిడ్19 పై సీఎం కేసీఆర్ సమీక్ష మొదలైనది. ఈ సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు. కరోనా కట్టడిపై ప్రస్తుతం రాష్ట్రములో తీసుకుంటున్న చర్యలు, రేపటి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నేపద్యంలో ఏ అంశాలు మాట్లాడాలి అనే అంశంపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉన్నది అనే అంశంపై అధికారులని సీఎం అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే లాక్ డౌన్ సడలింపులు, పొడిగింపు అనే వాటి మీద సీఎం మాట్లాడుతున్నారు అని సమాచారం. సమీక్షా తరువాత సీఎం ప్రెస్ మీట్ ఉంటున్నాడా లేదా అనేది సందేహంగా ఉంది.