పాతపట్నంలో కొత్త కేసులు

ఆంధ్రప్రదేశ్ లో వెయ్యికి పైగా దాటినా కరోనా కేసులలో నిన్నటి వరకు ఆ జిల్లాను మాత్రం తాకలేదు. ఇంతలో ఏమి అయిందో ఏమో ఇవాళ ఒక్క రోజే ఆ జిల్లా లో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు కరోనా ఫ్రీ గా ఉన్న శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా జిల్లాలోని పాతపట్నం మండలాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. పాతపట్నంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగా అధికారులు పాతపట్నంను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మండలం పరిధిలోని 18 గ్రామాలలో హైపోక్లోరైడ్ స్ప్రే, బ్లీచింగ్, పారిశుధ్య పనులు చేపట్టారు. 23 మంది వైద్యాధికారులతో పాటు 200 మంది సిబ్బందితో ఇంటింటి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతపట్నంలో కోవిడ్ కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. త్రాగునీరు, నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు.