మా రాష్ట్రం…మా భాషా …మా పేర్లు

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత మరో అడుగు ముందుకేసింది తెరాస సర్కార్. అనాదిగా వస్తున్న పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉతర్వులు జారీ చేసింది. ఇక నుండి ఖరీఫ్, రబీ కాలాలు అని పిలవకుండా , వానాకాలం, యాసంగి పంటలు అని పిలవాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నట్లు రైతు సంఘాల పలువురు నాయకులు పత్రిక ప్రకటనల ద్వారా తెలిపారు.