బిఆర్ కె భవన్ లో సిఎస్ తో ముగిసిన కేంద్ర బృందం భేటీ..

కరోనా కట్టడిపై తెలంగాణాలో తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం పర్యటన చేపట్టింది. సచివాలయంలో 3 గంటలుగా పైగా ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్బంగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించిన సిఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. కాగా గచ్చిబౌలి లో ఏర్పాటు చేసిన టిమ్స్ ఆస్పత్రి ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందని సిఎస్ కు తెలిపిన కేంద్ర బృందం తెలిపింది. కంటైన్మెంట్ జోన్లు గుర్తించిన విధానం పై సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు కేంద్ర బృందం సభ్యులు. హైదరాబాద్ లో కేసులు విస్తృతి ఏవిధంగా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. క్వారంటైన్ సమయం 28 రోజుల పొడిగింపు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కేంద్ర బృందానికి సిఎస్ వివరించారు. కరోనా బాధితులకు అందిస్తున్న భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్న కేంద్ర బృందం, ఆస్పత్రుల పరిశుభ్రత పై తీసుకుంటున్న చర్యలపై వివరాల సేకరించారు. కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్యులు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.