అనుమానం వస్తే అక్కడ 28 రోజుల ఉండాలి ‌

కరోనని కట్టడి చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌ గడువును 28 రోజులకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. కోవిడ్‌-19 ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ 14 రోజులు కావడంతో ఇప్పటివరకు రెండు వారాల హోం క్వారంటైన్‌ విధిస్తున్నారు. అయితే, కొన్ని కేసుల్లో 14 రోజుల అనంతరం పాజిటివ్‌గా ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు వైరస్‌ బాధితుడితో ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న వ్యక్తికి మాత్రమే పరీక్షలు‌ చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. సెకండరీ కాంటాక్ట్‌ను టెస్ట్ చేయొద్దని.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచితే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సెకండరీ కాంటాక్ట్‌కు స్టాంప్ వేసి.. 28 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉంచాలని సర్కార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఒడిశా, కేరళ, అస్సాం, జార్ఖండ్‌ రాష్ట్రాలు కూడా హోం క్వారైంటన్‌ కాలాన్ని 28 రోజులకు పెంచాయి.