ఎయిర్‌టెల్ తన పంపిణీదారులు మరియు భాగస్వాములకు మద్దతుగా ” కలిసి ఎదుగుదాం” ప్రచారాన్ని ప్రారంభించింది

కరోనా కారణంగా యావత్ వ్యాపారాలు దెబ్బతిన్న సమయంలో మిగత రంగాలతో పోల్చినట్లయితే టెలికాం రంగం కొంతవరకు మేలుగా ఉంది, సమాజానికి మరియు దేశానికి ఒక ఆశా కిరణంల కనపడుతుంది

ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎయిర్టెల్ తమకు ఎల్లపుడు అండగా ఉండే పంపిణీదారులు మరియు రిటైల్ ఫ్రాంచైజీ వారికీ తన బంధాన్ని మరింత బలపరిచేందుకు సహాయం చేయాలనీ సంకల్పించింది. ఎయిర్టెల్ తన పంపిణీదారులు మరియు రిటైల్ ఫ్రాంచైజీల ఉద్యోగుల ఏప్రిల్ జీతాలను చెల్లిస్తుంది. కృతజ్ఞతా సంజ్ఞగా, ఎయిర్టెల్ తన పంపిణీదారులతో కలిసి పనిచేసే అన్ని ఫీల్డ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్లకు ఉచిత COVID-19 భీమాను కూడా అందించింది.

అదనంగా, ఎయిర్టెల్ వారి పంపిణీదారుల పిల్లలకు వారి కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో స్కాలర్‌షిప్ పథకాలను అందిస్తూనే ఉంటుంది అని భారతి ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈవో అవనీత్ సింగ్ పూరి తెలిపారు.