వలస కూలీలు ఎక్కడ ఉన్నవారు అక్కడే, రాష్ట్రాలు దాటొద్దు : కేంద్ర హోంశాఖ
వలస కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వలస కూలీలు ఎవరూ రాష్ట్రాలు దాటవద్దు అని తమ ఆదేశాల్లో కేంద్రహోంశాఖ పేర్కొన్నది. ఎక్కడ ఉన్న కూలీలు.. అక్కడి ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలన్నది. లాక్‌డౌన్ కాలం ముగిసే వరకు వలస కూలీలు రాష్ట్రాలు దాటవద్దు అని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న వారు స్థానిక అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలని హోంశాఖ తెలిపింది. ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలన్నది.
ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాల్లో పని చేసుకునేందుకు ప్రభుత్వం వలస కూలీలకు అనుమతి ఇచ్చింది. ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, కన్‌స్ట్రక్షన్, వ్యవసాయం, మన్రేగా లాంటి పనులు వలస కూలీలు చేసుకోవచ్చు అని హోంశాఖ పేర్కొన్నది. ఏదైనా రాష్ట్రంలోని వారు మరో నగరంలో కూలీలకు పని దొరికే అవకాశం ఉంటే, అప్పుడు వారు స్క్రీనింగ్ తర్వాత అక్కడికి వెళ్లవచ్చు అని పేర్కొన్నది. ఎటువంటి వైరస్ లక్షణాలను లేని వారిని మాత్రమే షెల్టర్ క్యాంపుల నుంచి వర్కింగ్ ప్రదేశాలకు తరలించాలని ప్రభుత్వం తన ఆ దేశాల్లో పేర్కొన్నది.