కరుణామయుల కానుకలు

కరోనా కష్ట కాలంలో కరుణామయులు తెలంగాణ సర్కారుకి చేదోడు వాదోడులాగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా విరాళాల రూపంలో కోట్ల రూపాయలు అందించారు. ఈరోజు కూడా మంత్రి కే తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు అందించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన నియోజకవర్గం పరిధిలోని పలువురు ఇచ్చిన 23 లక్షల 25 వేల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కి ఈరోజు ప్రగతి భవన్ లో అందించారు. హ్యమ్ టెక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షల రూపాయలను సీఎంఆర్ఎఫ్ కోసం అందించింది.