తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు ఇప్పుడు తమ ఎలక్ట్రిసిటీ, వాటర్,
ఇతర బిల్లులు పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు
- ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ ను అందిస్తోంది పేటీఎం యాప్
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ పి డిసిఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్ఎస్ పిడిసిఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి) వంటి అత్యవసరాల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు.
- మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్, క్రెడిట్ కార్డ్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు కూడా ఇప్పుడు మరెంతో సులభం
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రజలం దరినీ ఇళ్లలోనే ఉండాల్సిందిగా సూచించారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నివాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ పిడిసి ఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టిఎస్ఎస్ పిడిసిఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి) వంటి అత్యవసరా ల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు.
భారతదేశ అగ్రగామి డిజిటల్ పేమెంట్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ వేదిక అయిన పేటీఎం ఇ టీవల తన యూజర్ ఇంటర్ ఫేస్ ను ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ఫీచర్ తో శక్తివంతం చే సింది. ఈ విధంగా అన్ని బిల్లింగ్ సంబంధిత అవసరాలు ఒక్క వేదికపై సమగ్రం చేయబడ్డాయి. దీం తో సంబంధిత వెబ్ సైట్లకు మారాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్ ప్రొవైడర్ల ఐకాన్ల నుం చి కావాల్సిన దాన్ని ఎంచుకోవచ్చు. వినియోగదారులు తమ మొబైల్, డీటీహెచ్ రీచార్జి, ఎలక్ట్రిసిటీ బి ల్, క్రెడిట్ కార్డ్ వంటి చెల్లింపులు చేసేందుకు ఈ నూతన యాప్ వీలు కల్పిస్తుంది. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉన్నాయి. బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ‘బై ఇన్సూ రెన్స్’ ట్యాబ్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నివాసులు తమ అపార్ట్ మెంట్ మెయింటెనెన్స్ బిల్లును కొద్ది నిమి షాల్లోనే చెల్లించవచ్చు. మీ సొసైటీ / అపార్ట్ మెంట్ పే టీఎం యాప్ లో నమోదు కాకున్నా కూడా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా మీరు చెల్లింపులు చేయడం ప్రారంభించవచ్చు.
ఈ సందర్భంగా పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులకు మనం ఏ విధంగా సహాయపడగలం అనే విషయాన్నిఅర్థం చేసుకునేందుకు మా జట్టు దానికి లభించిన వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వినియోగించుకుంది. మేము పేటీఎం యాప్ ఇం టర్ ఫేస్ ను పునరుద్ధరించాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు సులభంగా ఎసెన్షియల్ పే మెంట్ ఐకాన్ ను చూడగలుగుతారు మరియు తమ ఇళ్ల లో నుంచి బయటకు వెళ్ళడాన్ని తప్పించుకోగలు గుతారు. తద్వారా ఇన్ ఫెక్ట్ అయ్యే రిస్క్ ను తప్పించుకోగలుగుతారు. కోవిడ్ -19పై సమాచారం మరియు స హాయ కేంద్రాన్ని కూడా మేము ఆవిష్కరించాం. తద్వారా ప్రజలు వివిధ సోషల్ మీడియా వేదిక లపై వ్యాప్తి అయ్యే తప్పుడు సమాచారం కారణంగా తప్పుదోవ పట్టకుండా ఉంటారు. వివిధ జాతీయ మరియు ప్రాంతీ య మీడియా పబ్లికేషన్స్ కు సంబంధించి 50కి పైగా ఇ-న్యూస్ పేపర్స్ కు ఉచిత యాక్సెస్ ను కూడా మే ము కల్పిస్తున్నాం. మా సెల్ఫ్ అసెస్ మెంట్ టూల్ సహాయంతో యూజర్లు ఈ వైరస్ కు తమ రిస్క్ ఫ్యాక్టర్ గురించి పరీక్షించుకోవచ్చు మరియు సురక్షితంగా ఉండేందుకు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు పాటిం చవచ్చు’’ అని అన్నారు.