ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కుల పంపిణి
కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని అన్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి గుంపులుగా తిరిగే వారి పై చర్యలు తీసుకోవాలని అయన ఆదేశించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ రాబర్ట్ సూర్య ప్రకాశ్, ట్రస్టీ లు డి. రాజ్ కుమార్, డి. లియోనార్డ్ పురుషోత్తం, ఐజాక్, క్రీస్తు దాస్, క్రిస్తోఫేర్, విల్సన్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి విజయ కుమారి, టీం యునైటెడ్, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి సభ్యులు పాల్గొన్నారు.