తెలంగాణాలో కోరలు చాస్తున్నకరోనా
రోజు రోజుకి తెలంగాణాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నారు. ఒకరోజు తక్కువ కేసులు నమోదు అయితే హమ్మయ్య అంటూ బతుకుతున్నవారికి మరసటి రోజే కేసుల సంఖ్య పెరగడంతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. గురువారం ఒక్కరోజే 50 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇవాళ్టి కొత్త కేసులన్ని గ్రేటర్ పరిధిలోనే నమోదు అయినట్లు చెప్పారు. ఇప్పటివరకూ తెలంగాణ 700 కేసులు నమోదు కాగా, 18మంది మృతి చెందినట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి కోలుకుని 186మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. ఇవాళ 68మంది డిశ్చార్జ్ కాగా, ఎవరూ చనిపోలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా లాక్‌డౌన్‌పై మొదట ప్రకటన చేసింది తెలంగాణయేనని అన్నారు. పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.