మానవత్వం ముందు కరోనా తలవంచాల్సిందే
చిలకలూరిపేటలోని కొన్ని ప్రాంతాలలో దాదాపు 1200 కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేసారు చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని. ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున పార్టీ నాయకురాలు తోట నాగలక్ష్మి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విడదల రజిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా ప్రభావం జనజీవనంపై తీవ్ర స్థాయిలో పడుతోందన్నారు. లాక్‌డౌన్ ప్రకటించాక నిరుపేదలు ఉపాధి లేక పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ, ఏ ఒక్క రోజూ ఉపాధి లేక ఆకలితో ఉండాల్సిన దుస్థితి రాకూడదన్నారు. అవసరమైన సాయం తాము చేస్తామని చెప్పారు. నియోజకవర్గం మొత్తం అన్ని కుటుంబాలకు కావాల్సిన సాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. మానవత్వాన్ని చాటుకుంటే లాక్‌డౌన్ ప్రభావం నుంచి పేదలను ఆదుకోవచ్చని తెలిపారు. సేవాగుణం, స్వీయనియంత్రణే ఇప్పుడు మనకు ప్రధానమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొన్నారు.