ఐఐటీ జేఈఈ/నీట్ లైవ్ స్ట్రీమింగ్ పాఠాల కోసం యప్ మాస్టర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, ప్రఖ్యాత వైద్య కళాశాలల్లో సీటు సాధించడం ప్రతి విద్యార్థి కల. అలాంటివారి సాకారం చేసుకోవడంలో తమ వంతుగా సాయం చేసేందుకు దక్షిణాసియాలోనే పేరొందిన ప్రముఖ ఓవర్-ది-టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫాం సంస్థ యప్ టీవీ ముందుకొచ్చింది. తన అనుబంధ సంస్థ ‘యప్ మాస్టర్’ ద్వారా ఐఐటీ జేఈఈ/నీట్ లైవ్ స్ట్రీమింగ్ తరగతులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
యప్ మాస్టర్ ద్వారా ప్రతి విద్యార్థికీ అందుబాటు ధరలోనే లైవ్ స్ట్రీమింగ్ తరగతులను సంస్థ అందించేందుకు సిద్ధమైంది. విద్యారంగంలో 10 నుంచి 25 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ప్రొఫెసర్లు విద్యార్థులకు బోధిస్తూ ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తారు. లైవ్ స్ట్రీమింగ్ కోసం అత్యాధునిక సాంకేతికతను సైతం సంస్థ వినియోగిస్తోంది. ఐఐటీ జేఈఈ (మెయిన్స్, అడ్వాన్స్‌డ్), నీట్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లను (100 లోపు ర్యాంకులు) వెలికితీయడంలో వీరి బాధ్యత ఎంతో కీలకమైనది. మరోవైపు యప్ మాస్టర్‌లో ఇంటరాక్టివ్ లైవ్ చాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వెంటనే విద్యార్థుల సందేహాలను ప్రొఫెసర్లు నివృత్తి చేసేందుకు వీలుంటుంది. కేవలం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా బోధనలే కాకుండా వేల సంఖ్యలో వీడియో పాఠాలు, మాక్ టెస్టులు, రిజల్ట్ అనాలసిస్ లాంటి మరికొన్ని అదనపు సదుపాయాలను ఒక ప్యాకేజీ రూపంలో విద్యార్థులకు యప్ మాస్టర్ అందిస్తోంది. అది కూడా అందుబాటు ధరలోనే కావడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఇప్పటి వరకు వినోదం అందిస్తూ వచ్చాం.. ఇప్పుడు యప్ మాస్టర్ ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందని యప్ టీవీ, యప్ మాస్టర్ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి అన్నారు. ‘విద్యార్థుల కోసం యప్ మాస్టర్‌ను ప్రవేశపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. దేశానికి సేవ చేసేందుకు అవకాశం లభించింది. విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి సైతం సరసమైన ధరలోనే విద్య అందుబాటులోకి రావాలి. అనేక కారణాలతో చదువుకు దూరంగా ఉన్న వారికి నాణ్యమైన విద్య, ఉత్తమ బోధనను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మా దృష్టి అంతా ఐఐటీ జేఈఈ, నీట్ అభ్యర్థులపై కేంద్రీకరించాం. సమీప భవిష్యత్‌లో అన్ని తరగతుల విద్యార్థులకు యప్ మాస్టర్ సేవలు విస్తరిస్తాం. యప్ మాస్టర్ యాప్ కార్యరూపంలోకి రావడానికి వివిధ రూపాల్లో సాయం అందించినవారు, విద్యార్థులకు బోధించేందుకు దీని ద్వారా ముందుకొచ్చిన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని ఉదయ్ రెడ్డి వివరించారు.
ఐఐటీ జేఈఈ, నీట్ అభ్యర్థులకు 45 రోజులపాటు క్రాష్ కోర్సును యప్ మాస్టర్ అందిస్తుంది. దీనిలో భాగంగా ప్రతి రోజూ నాలుగున్నర నుంచి 6 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రొఫెసర్లు వివిధ అంశాలపై విద్యార్థులకు బోధిస్తారు. జరిగిపోయినటువంటి తరగతులకు సంబంధించిన సమాచారం సైతం ఆర్కైవ్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇటీవలి కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒక్కటైన ఈ లైవ్ స్ట్రీమింగ్ కోచింగ్ యాప్ ఆన్‌లైన్ విద్యారంగంలో తనదైన ముద్ర వేస్తుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. యప్ మాస్టర్ అందిస్తున్న కోర్సుకు సంబంధించి పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్ https://www.yuppmaster.comని సంప్రదించండి.