హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్
భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు 1.75 కోట్ల విలువైన షేర్లను చైనా బ్యాంకు కొనుగోలు చేసింది. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ బాంబే స్టాక్ ఎక్సేంజికి సమాచారం అందించింది. కరోనా వైరస్ కారణంగా మార్కెట్‌లో సంస్థ స్టాక్ విలువ నెలరోజుల్లో 25 శాతానికిపైగా పడిపోయాయి. గతేడాది మార్చి నాటికి పీబీఓసీ హెచ్‌డీఎఫ్‌సీలో 0.8 శాతం షేర్లు కలిగి ఉన్నదని సంస్థ వైస్ చైర్మన్, సీఈవో కెకి మిస్త్రి పేర్కొన్నారు. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ విలువ రూ.1701.95గా ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటాలను కొనుగోలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే రాయల్ డచ్ షెల్ పీఎల్‌సీ, బ్రిటిష్ పెట్రోలియంలలో ఇప్పటికే వాటాలు కొనుగోలు చేసింది.