ఎన్‌పీఎస్‌ నిధుల ఉపసంహరణకు పీఎఫ్‌‌ఆర్‌డీఏ ఆమోదం

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) చందాదారులందరూ కోవిడ్‌-19 సంబంధిత చికిత్స కోసం వారి ఖాతాలోని సొమ్మును పాక్షికంగా తీసుకునేందుకు పీఎ్‌ఫఆర్‌డీఏ అనుమతి ఇచ్చింది. ఆ వ్యాధిని మహమ్మారిగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రానాంతకమైన అనారోగ్యంగా దాన్ని పరిగణించి నిధుల ఉపసంహరణకు అనుమతించినట్టు పీఎ్‌ఫఆర్‌డీఏ  తెలిపింది. చందాదారులు, వారి చట్టబద్ధమైన భార్య లేదా భర్త, ,పిల్లలు, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరికైనా ఈ వ్యాధి సోకితే చికిత్సా వ్యయాల కోసం ఎన్‌పీఎ్‌సలోని నిధులను పాక్షికంగా తీసుకోవచ్చునని తెలియచేసింది. అయితే అవ్యవస్థీకృత రంగాల్లోని కార్మికుల కోసం అమలు పరుస్తున్న అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) చందాదారులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.