డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త.

డీటీహెచ్‌ సెట్‌-టాప్‌ బాక్స్‌ వినియోగదారులకు శుభవార్త. త్వరలోనే సెట్‌-టాప్‌ బాక్స్‌ మార్చకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకునేందుకు వీలు కలగనుంది. ఈ మేరకు శనివారం భారత్‌ టెలికాం నియంత్రణ ప్రాధికారత సంస్థ (ట్రాయ్‌) పలు సిఫార్సులు జారీ చేసింది. సెట్‌-టాప్‌ బాక్సులను పరస్పరం మార్చుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆయా సంస్థలకు సూచించింది. ఈ సెట్‌-టాప్‌ బాక్సుల సాయంతో వినియోగదారులు కొత్త బాక్సులు కొనకుండానే డీటీహెచ్‌ ఆపరేటర్లను మార్చుకోవచ్చు. ఈ మేరకు నిబంధనలను రూపొందించాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు ట్రాయ్‌ సూచించింది. ఈ ప్రక్రియ అమలులో సమన్వయానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖ, ట్రాయ్‌, బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌), టీవీలు ఉత్పత్తి చేసే సంస్థలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది. మరోవైపు అన్ని డిజిటల్‌ టీవీలు యూఎస్‌బీ పోర్ట్‌కు సపోర్ట్ చేయాలని, కేబుల్‌, శాటిలైట్‌ సిగ్నళ్లు స్వీకరించగలిగేలా తయారు చేయాలని సూచించింది.