పాత్రికేయులు స్వీయ రక్షణలో ఉండండి
పాత్రికేయులను వాడుకున్న వారు ప్రస్తుతం కనుచూపు మేరలో లేరు.
ప్రతీజిల్లాలో, ప్రతీ మండలంలో ఉన్న ప్రముఖ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకుల, ప్రముఖ వ్యాపారవేత్తల, ప్రముఖ వైద్యుల, ప్రముఖ వైద్యశాలలు, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఫౌల్ట్రీ రంగం, స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల వార్తలు ప్రతీ విలేకరి,(ప్రింట్ మరియుఎలక్ట్రానిక్ మీడియా)వారు పడి, పడి వ్రాసారు, అక్కడ ప్రెస్ మీట్, ఇక్కడ ప్రెస్ మీట్ అని మెసేజీలు పెట్టి పాత్రికేయులను వాడుకున్న వారు ప్రస్తుతం కనుచూపు మేరలో లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి మీద యుద్ధం ప్రకటించి విలేకరులు కుటుంబాలకు దూరంగా ఉంటూ ,ప్రాణాలను సైతం లెక్కచేయకుండా,ప్రతీ నిత్యం వార్తలు సేకరిస్తూ,జీత భత్యాలు లేక బతుకు బండి లాగుతూ విశ్లేషణ తో కూడిన వార్తలు సమాజానికి అందిస్తూ ఉంటే ప్రతీ ఒక్కరూ మా వార్త వ్రాయండి,మా వార్త రాయండి అంటూ చెప్పిన ప్రముఖులు ఒక్కరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులకు కనీసం సానిటైజర్స్, మాస్కులు, గ్లోజులు కానీ ఇచ్చిన దిక్కు లేరు,కనీసం ఫోన్ చేసి పరామర్శించిన వ్యక్తే లేరు, పాత్రికేయ మిత్రులారా ఆలోచించి నిర్ణయం తీసికొండి, కనీసం ప్రభుత్వం కూడా పట్టించు కోవటం లేదు,హెల్త్ కార్డ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ , అక్రిడేషన్ కార్డ్స్ లేవు,వాటి గూర్చి పట్టించు కున్న నాధుడే లేరు.విలేకరులు ఎక్కడైన తిరగొచ్చు అని మేసేజ్ మాత్రం యిచ్చారు. ఆరోగ్యానికి మాత్రం రక్షణ భరోసా లేదు,మనకు కుటుంబాలు,పిల్లలు,బాధ్యతలు ఉన్నాయి, అనవసరంగా వచ్చి ఇబ్బందులు పడవద్దు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి వార్తలు అందిస్తే మంచిది, అవసరాలకు అనుగుణంగా వాడుకొని ,తరువాత పట్టించుకోకుండా ఉండే పరిస్థితులు ,ప్రతీ పాత్రికేయ డు స్వీయ రక్షణలో ఉండండి,కుటుంబాలతో కలసి ఉండండి,బయటకు వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసికొని రావటం మంచిది…..కనీసం జిల్లా, మండల స్థాయి విలేకరుల అవసరాలకు అపత్కాల సమయంలో నిత్యావసర వస్తువులు కానీ,రైస్ కానీ,ఆర్థిక సహాయం కానీ ఇస్తాను అన్న నాధుడే లేడు,ప్రతీ ఒక్కరూ మికేమిలే విలేకరులు అనేవారు,మా బాధలు,బాధ్యతలు ఎవరికి ఎరుక,జీతాలు లేవు,భత్యాలు లేవు పైపై మెరుగులే, కరోనా వైరస్ వచ్చింది జాగ్రత్తగా ఉండండి అని విలేకరి వ్రాస్తేనే ప్రపంచానికి తెలిసింది,తెలిపింది విలేకరే ,సమాజాన్ని జాగృతం చేసి మేలుకొలిపే ది మనమే ,మనలను ఆదుకునే నాధుడే లేడు, లాకౌట్ సమయంలో తిన్నార లేదా,ఎలా ఉన్నారు అన్నా నాధుడే లేడు, వార్తలు వ్రాసారా,మా వార్త ఈ రోజు వచ్చిందా అని అడిగారు గాని ఇప్పుడు న్న పరిస్తిలో సహాయం చేసే నాధుడు ఏడి మిత్రులారా…మిత్రులారా జాగ్రత్త ఉండండి, మనలను మనమే కాపాడుకోవాలి, తప్పకుండా ప్రతీ ఒక్కరు కోరంటైన్ లో ఉంటూ కుటుంబాలకు దగ్గరగా ఉండమని మనవి….పూర్తి జాగ్రత్తలు పాటించండి… వాడుకునే వాడే కానీ,ఆదుకునే వాడు లేడు…
ఇది
జర్నలిస్టుల పరిస్థితి..??.