నెట్‌ఫ్లిక్స్, ఏసీటీ ఫైబర్‌నెట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సందడి చేసిన ‘సూపర్ సుబ్బు’

– సందీప్ కిషన్, మల్లిక్ రామ్‌ను కలుసుకునేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు

Hyderabad, జూలై 2026: నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ విడుదల సందర్భంగా నెట్‌ఫ్లిక్స్, ఏసీటీ ఫైబర్‌నెట్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని నెక్సస్ మాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు సిరీస్ కథానాయకుడు సందీప్ కిషన్, సృష్టికర్త–దర్శకుడు మల్లిక్ రామ్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని సందడి చేశారు.

సిరీస్‌లోని ప్రముఖ ‘ఫ్యామిలీ ప్లానింగ్ మాస్టర్‌క్లాస్’ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా పునఃసృష్టించి, కల్పిత గ్రామం ‘మాకీపూర్’ వాతావరణాన్ని అభిమానులకు పరిచయం చేశారు. తెలంగాణ జానపద కళ బుర్రకథ ప్రదర్శనతో ప్రారంభమైన కార్యక్రమంలో అభిమానులు వినోదాత్మక ఆటల్లో పాల్గొని, ప్రత్యేక ఫొటో జోన్‌లలో చిత్రాలు దిగడంతో పాటు స్మారక బహుమతులను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఏసీటీ ఫైబర్‌నెట్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రవి కార్తిక్ మాట్లాడుతూ, వినియోగదారులకు వినోదాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వినూత్న అనుభవాలను అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వం కలిగిన ఏసీటీ ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ద్వారా ‘సూపర్ సుబ్బు’ సిరీస్‌ను ఇంటి నుంచే వీక్షించే అవకాశం వినియోగదారులకు అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.