మాతృత్వం ఇచ్చిన ప్రేరణతో, ఇళ్లు, వ్యాపారం, జీవితాన్ని కలిసి నిర్మించుకున్న ఇద్దరు సోదరీమణులు

దీక్షా, దివ్యలకు వ్యాపారం అనేది ఒక్కసారిగా మొదలైన ప్రయాణం కాదు… వారు జీవిస్తున్న జీవితంలో నుంచే సహజంగా మొలకెత్తిన ఆలోచన.

ఈరోజు ఈ సోదరీమణులు కలిసి హైదరాబాద్‌లో ఒక హోమ్ లేన్ ఫ్రాంచైజ్‌ను విజయవంతంగా నడుపుతున్నారు. ఒకవైపు తమ చిన్నారులను ప్రేమగా పెంచుకుంటూనే, మరోవైపు తమ కలలను ఒక్కొక్కటిగా నిర్మించుకున్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారి పిల్లలు ఒకే పాఠశాలలో చదువుతారు. స్కూల్‌ అయిపోయాక చాలాసార్లు షోరూమ్‌లోనే సమయం గడుపుతారు. చిన్నప్పటి నుంచే మీటింగులు, డిజైన్ చర్చలు, రోజువారీ వ్యాపార నిర్ణయాలు, ఇవన్నీ వారి ఎదుగుదలలో సహజమైన భాగాలయ్యాయి.

కుటుంబం ఒక వైపు… పని మరో వైపు… అని వీరు ఎప్పుడూ భేదభావం చూపలేదు. కాలక్రమేణా, ఈ రెండింటినీ అందంగా కలగలిపి జీవించడం నేర్చుకున్నారు.

నల్గొండలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగిన దీక్షా… ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌లో విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లింది. ఆమె కెరీర్‌ ప్రారంభ దశలో రీసెర్చ్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో పనిచేసింది. అయితే విదేశీ జీవితం ఆమెను తరచూ కొత్త నగరాలు, కొత్త ఇళ్ల మధ్య ప్రయాణించేలా చేసింది. అలా ప్రతి కొత్త ఇంటిని తనదైన శైలిలో మలుచుకుంటూ ఉండగానే, ఇంటీరియర్స్‌పై, ఉపయోగకరమైన డిజైన్‌పై, మన జీవనశైలిని ఒక స్థలం ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయంపై ఆమెకు మరింత లోతైన ఆసక్తి పెరిగింది.

హైదరాబాదుకు వచ్చిన తర్వాత, దీక్షా తన సొంత ఇంటి రూపకల్పన పనిని స్వయంగా ప్రారంభించింది. మొదట అది కేవలం వ్యక్తిగత అవసరంగా మొదలైనా కూడా, ఆ అనుభవం క్రమంగా ఇంటీరియర్స్‌, హోమ్‌ డిజైన్‌పై ఆమెకు ఉన్న ఆసక్తిని మరింతగా పెంచింది. ఆ ఇంటి రూపకల్పనకు వచ్చిన మంచి స్పందన ఆమెకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అదే ప్రేరణతో ఆమె స్వతంత్రంగా ఇళ్లను కొనుగోలు చేసి, వాటికి ప్రత్యేకమైన డిజైన్‌ ఇచ్చి, మళ్లీ విక్రయించే ప్రయాణాన్ని ప్రారంభించింది.

హోమ్ లేన్, దీక్షా జీవితంలో మొదట ఒక కస్టమర్‌ అనుభవంగా ప్రవేశించింది. అయితే ఆ పరిచయం రావడానికి ముందు ఆమె కొంత నిరాశను కూడా ఎదుర్కొంది. ఇంటీరియర్‌ రంగంలోని మరికొన్ని ఆర్గనైజ్డ్‌ సంస్థలతో పనిచేసినప్పుడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం మరియు నిర్ణయించిన సమయాలు పదేపదే మారిపోవడం ఆమెను అసంతృప్తికి గురి చేశాయి. ఆ అనుభవాల వల్ల ఈ రంగంపై ఆమెకు సహజంగానే కొంత అప్రమత్తత ఏర్పడింది. కానీ హోమ్ లోన్ తో అనుభవం మాత్రం పూర్తిగా భిన్నంగా అనిపించింది. ప్రతి వ్యవస్థలో స్పష్టత కనిపించింది. ప్రతి ప్రక్రియలో నమ్మకం కనిపించింది. డిజైన్‌ నుంచి ప్లానింగ్‌ వరకు, అమలు దశ వరకు ప్రతి అడుగులోనూ బలమైన సహకారం అందింది. అందులో ముఖ్యంగా ఆమెను ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, స్థిరత్వం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, చెప్పిన సమయానికి పని పూర్తి చేయడం లాంటి హామీలను నిజంగా నిలబెట్టే సంస్థ హోమ్ లేన్ అని ఆమెకు అనిపించింది.

కానీ దీక్షాను అత్యంతగా ఆకట్టుకున్న విషయం ఇంకొకటి ఉంది, అదేమిటంటే, హోమ్ లేన్ టీమ్‌ నుంచి ఆమె ఎప్పుడూ “అది సాధ్యం కాదు” అనే సమాధానం వినలేదు. డిజైన్‌కు సంబంధించిన సందేహం అయినా, లేదా ఆపరేషన్స్‌లో వచ్చిన సమస్య అయినా, లేదా ప్రాజెక్ట్‌లో ఏ దశలో వచ్చిన అభ్యర్థన అయినా సరే, ప్రతి సారి వారు ఒక పరిష్కార మార్గంతో ముందుకొచ్చేవారు. “కాదు” అనే మాటకంటే “ఇలా చేస్తే సాధ్యమే” అనే ధోరణి ఎక్కువగా కనిపించేది. ఆ నమ్మకం, ఆ సమర్థతే దీక్షాకు మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. అలా కాలక్రమేణా ఆమె ఒక సంతృప్తికరమైన కస్టమర్‌ స్థాయి నుంచి ఫ్రాంచైజ్‌ భాగస్వామిగా మారింది. తర్వాత దివ్య కూడా ఈ ప్రయాణంలో చేరింది. మొదట్లో కర్టెన్స్‌ ఎంపిక చేయడంలో కూడా పెద్దగా అవగాహన లేని ఆమె, ఈరోజు హోమ్ లేన్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో తన తొలి సేల్‌ను విజయవంతంగా పూర్తి చేసే స్థాయికి ఎదిగింది. దివ్య ప్రధానంగా ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌ను చూసుకుంటుండగా, ఆమె, దీక్షా ఇద్దరూ కలిసి వ్యాపారంలోని ప్రతి బాధ్యతను సమానంగా పంచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

ఈ సోదరీమణులు కలిసికట్టుగా, తమ వృత్తిపరమైన నైపుణ్యాలను మాత్రమే కాదు, తల్లులుగా జీవితంలో పొందిన అనుభవాలను కూడా కలిపి ఒక ప్రత్యేకమైన వ్యాపారాన్ని నిర్మించారు. వారి ప్రయాణం కేవలం బిజినెస్‌ విజయగాథ కాదు, కుటుంబం, బాధ్యతలు, కలలు, ఈ మూడింటినీ సమతుల్యంగా నడిపిస్తూ తమదైన ప్రపంచాన్ని సృష్టించుకున్న ఇద్దరు మహిళల కథ.

దీక్షాకు చూస్తే, ఫ్రాంచైజ్‌ను విజయవంతంగా నడపడం, తన కుమారుడిని పెంచడం వంటి ఈ రెండూ వేర్వేరు ప్రయాణాల్లా కనిపించినా, లోతులో మాత్రం ఎంతో సామ్యం ఉంది. ఈ రెండింటికీ ఓర్పు అవసరం. నిరంతర క్రమశిక్షణ అవసరం. ప్రతిరోజూ చిన్న చిన్న ప్రయత్నాలతోనే అవి రూపుదిద్దుకుంటాయి. ఒక చిన్నారికి సరైన మార్గదర్శనం, భరోసా, ప్రేమతో కూడిన చేయూత ఎంత అవసరమో, ఒక కొత్త వ్యాపారానికీ ముఖ్యంగా ప్రారంభ దశలో అంతే అవసరం ఉంటుంది. అలాంటి అండదండల్నే హోమ్ లేన్ ఆమెకు అందించింది. ఒక మార్గదర్శిలా, ప్రతి దశలో నిలబడి ముందుకు నడిపించింది. అందుకే ఆమె తరచూ తన కుమారుడిని షోరూమ్‌కు తీసుకువస్తుంది. ఎందుకంటే, క్రమశిక్షణ, స్థిరత్వం, కష్టపడి పనిచేయడం అనేవన్నీ కలిసే ఒక అర్థవంతమైన కల ఎలా నిర్మితమవుతుందో అతడు చిన్నప్పటి నుంచే చూడాలని ఆమె కోరుకుంటుంది.

వారి ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏమిటంటే, అందులో కనిపించే నిజాయితీ. పని, మాతృత్వం మధ్య ఎప్పుడూ “పర్ఫెక్ట్‌ బ్యాలెన్స్‌” సాధించామని చూపించే ప్రయత్నం ఇందులో లేదు. దాని బదులు… జీవితంలోని ప్రతి దశలో ఒకరికి ఒకరు తోడుగా నిలబడి, పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, కొత్త అవకాశాలను సృష్టించుకున్న నిజమైన ప్రయాణం ఇది. ఇది కేవలం విజయాన్ని గురించి చెప్పే కథ మాత్రమే కాదు,  మార్పులను అంగీకరిస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగిన ఇద్దరు మహిళల జీవనగాథ.

వారి ప్రయాణాల వంటివి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు కూడా వ్యవస్థీకృతమైన వ్యాపార విధానంతో వ్యవస్థాపకత్వాన్ని అన్వేషించేలా హోమ్ లేన్ ఎలా అవకాశాలు కల్పిస్తుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. దీక్షాకు “ఇల్లు” అనేది కేవలం డిజైన్‌తో అర్థమయ్యే స్థలం కాదు. ఒక కుటుంబం నవ్వులు, జ్ఞాపకాలు, అనుబంధాలతో నిర్మించుకునే జీవితం అని ఆమె లోతుగా అనుభవించింది. ఆ జీవించిన అనుభవమే ఆమె వ్యాపార ప్రయాణానికి బలమైన పునాది అయింది. ఆ పునాదిపై ముందుకు ఎదగడానికి అవసరమైన స్థిరమైన వ్యవస్థ, విస్తృత స్థాయి అవకాశాలు, సమర్థవంతమైన ఆపరేషనల్ సహకారం లాంటివన్నీ హోమ్ లేన్ ఆమెకు నమ్మకమైన వేదికగా నిలిచాయి.

ఈ మాతృ దినోత్సవ సందర్భంగా, దీక్షా, దివ్యల కథ ఒక అందమైన నిజాన్ని గుర్తు చేస్తోంది, మాతృత్వం వచ్చిందని ఆశయాలు మాయమవ్వవు. అవి కేవలం మరింత లోతైన అర్థాన్ని సంతరించుకుంటాయి. ఇక విజయమే కాదు, కుటుంబానికి, పిల్లలకు, తమ కలలకు ఒక అర్థవంతమైన భవిష్యత్తు నిర్మించాలనే కొత్త ఉద్దేశ్యంగా మారిపోతాయి.