ఈ పండుగ కాలంలో చిన్న వ్యాపారాలను, సైబర్ మోసాల నుండి రక్షించుకోవడానికి సూచనలు
ఈ పండుగ సమయం, చిన్న వ్యాపారాలకు అమ్మకాల పరంగా ఆనందాన్ని తెస్తుంది, కానీ అదే సమయంలో సైబర్ మోసాలకు అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సి.ఇ.ఆర్.టీ.-ఇన్) మరియు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డి.ఎస్.సి.ఐ.) ప్రకారం, గత సంవత్సరం74%చిన్న, మధ్య స్థాయి సంస్థలు కనీసం ఒక సైబర్ ఘటనను ఎదుర్కొన్నాయి. బృందాలు బిజీగా ఉండటంతో మరియు ఆర్డర్లు ఎక్కువగా రావడంతో, మోసగాళ్లు తక్షణ డెలివరీలు, ఫేక్ పేమెంట్లు, ఫిషింగ్ లింక్‌ల ద్వారా మోసాలు చేస్తారు.
పండుగ సమయంలో మోసగాళ్లు చిన్న వ్యాపారాలను టార్గెట్ చేసే మార్గాలు:
- కొనుగోలుదారులుగా నటిస్తూ, నకిలీ పేమెంట్ రశీదులు పంపి చెల్లింపులు లేకుండా సరుకులను పంపించించేస్తారు
- సరఫరాదారులుగా నటించి, ఈమెయిల్‌లో నకిలీ బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్లను అడుగుతారు
- నకిలీ డెలివరీ సందేశాలు పంపడం లేదా కాల్స్ ద్వారా మీసిస్టమ్స్కు యాక్సెస్ పొందడం
- పండుగ శుభాకాంక్షల రూపంలో నకిలీ క్యుఆర్కోడ్‌లు లేదా ఓటిపిప్రాంప్ట్‌లను పంపడం
- పెద్ద కంపెనీలుగా నటించి, తక్షణ ఆర్డర్‌ల కోసం ఒత్తిడి తేవడం
మోసాలకు బలి కాకుండా ఉండేందుకు చిట్కాలు – “ఆగండి, ఆలోచించండి, చర్యతీసుకోండి!”
- సరుకులు పంపేముందు యుపిఐలేదా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ఖాతాలో క్రెడిట్ అయిందా లేదా నిర్ధారించుకోండి
- బ్యాంక్ వివరాల మార్పును నమ్మదగిన కాంటాక్ట్‌తో ధృవీకరించండి
- తెలియని లింక్‌లు, క్యుఆర్కోడ్‌లు లేదా అత్యవసర సందేశాలపై సిబ్బందికి అవగాహన కల్పించండి
- మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడండి, ముఖ్యమైన వ్యాపార వ్యవస్థలకు యాక్సెస్ పరిమితం చేయండి
- అనుమానాస్పద కార్యకలాపాలను రిపోర్ట్ చేయడానికి ఒక సులభమైన విధానాన్ని ఏర్పాటు చేయండి
చివరి మాట:
ఈ డిజిటల్-ఫస్ట్ యుగంలో ఒక చిన్న తప్పిదం చేయడం – ఉదాహరణకి నకిలీ లింక్ క్లిక్ చేయడం లేదా ఓ పేమెంట్ తొందరలో చేయడం – పెద్ద నష్టానికి దారితీస్తుంది. చిన్న వ్యాపారాల కోసం, మౌలిక సైబర్ జాగ్రతను రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేయడం, కస్టమర్లను, ఆదాయాన్ని, ప్రతిష్టను రక్షించేందుకు చాలా అవసరం.
మీరు సైబర్ మోసానికి గురై ఉంటే లేదా అనుమానం ఉంటే, వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయండి లేదా cybercrime.gov.inవెబ్‌సైట్‌లో నివేదించండి.
ఫెడెక్స్, ఈ డిజిటల్ ప్రపంచంలో చిన్న వ్యాపారాలు మరింత సురక్షితంగా పనిచేయేందుకు సైబర్ అవగాహన, విద్యను ప్రోత్సహిస్తోంది.
మరిన్ని వివరాలకు, మోసాలను ఎలా ఎదుర్కొవాలో ఇక్కడక్లిక్చేసితెలుసుకోండి – జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి!











