గ్రేటర్ లో తుది దశ కు చేరిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
ఇప్పటి వరకు 78.53 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి,19.04,977 కుటుంబాల సర్వే పూర్తి
హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్ హైదరాబాదు పరిధిలో సమగ్ర ఇంటింటి సర్వే తుది దశకు చేరుకుంది. సోమవారం నాటికి .78.53.% సర్వే పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు .19,04,977 కుటుంబాల సర్వే పూర్తయింది.
ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ సర్కిల్ వారీగా చేపట్టబడుతోంది. డేటా నమోదు సమయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా, కోడింగ్ సరియైన విధంగా ఉండేలా చూడాలని సూచించారు. ఎలాంటి తప్పుడు నమోదు జరగకుండా ఎన్యుమరేటర్లు దగ్గర నుండి డేటా ఎంట్రీ చేపించాలని ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ డేటా ఎంట్రీ ని ఆన్ లైన్ లో సజావుగా నిశితంగా నమోదు చేయాలని సూచించారు
సర్వే పూర్తయిన ఫారాలను భద్రంగా నిల్వచేయాలని, ఒక్క ఫారం కూడా బయట కనిపించకుండా ఉండేలా అన్ని ఫారాలను స్ట్రాంగ్ రూంల్లో భద్రపరచాలని డిప్యూటీ కమిషనర్లు ఆదేశించారు. ఈ ప్రక్రియలో నోడల్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 78.53 శాతం పూర్తి కాగా మొత్తం 19,04,977 కుటుంబాల సర్వే పూర్తి అయ్యింది.