ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 126 ధరఖాస్తులు

హైదరాబాద్, నవంబర్ 25: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి కమీషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు.

జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమీషనర్ పాల్గొని పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలను అడుగుతూ అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడం ఫై ఆయా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 3 విన్నపాలు రాగా, పరిష్కారం నిమిత్తం ఆయా విభాగాలకు పంపించడం జరిగింది.

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 46 విన్నపాలు రాగా అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 21, ఎఫ్.ఏ, హెల్త్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగానికి 4, స్పోర్ట్స్, సి.ఇ మెయింటనెన్స్, ఎస్టేట్స్, ఎల్.డబ్ల్యు.ఎస్, హౌసింగ్ విభాగాలకు రెండు చొప్పున, విజిలెన్స్ విభాగానికి ఒక్క ఫిర్యాదు అందింది.

జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 80 అర్జీలు వచ్చాయి. అందులో కూకట్ పల్లి జోన్ లో 33, శేరిలింగంపల్లి జోన్ లో 9, ఎల్బీనగర్ జోన్ లో 14, సికింద్రాబాద్ జోన్ లో 21, చార్మినార్ జోన్ లో 3 ఫిర్యాదులు రాగా, ఖైరతాబాద్ జోన్ లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, నళిని పద్మావతి, వేణుగోపాల్ రెడ్డి, గీతా రాధిక, పంకజ, సరోజ, రఘు ప్రసాద్, సత్యనారాయణ, సుభద్ర దేవి, చంద్రకాంత్ రెడ్డి, సీఈ దేవానంద్, కోటేశ్వర రావు, అడిషనల్ సిసిపి లు గంగాధర్, ప్రదీప్, సి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, జాయింట్ కమిషనర్లు మహేష్ కులకర్ణి, హౌసింగ్ ఎస్ఈ కృష్ణారావు పీవీ రమణ రాజేశ్వర్ రావు, వాటర్ వర్క్స్ జి ఏం సాయి రమణ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.