‘‘దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఇ-కామర్స్ డెలివరీలను పెంచడానికి 

ఒక్కటైన ఐథింక్ లాజిస్టిక్స్ మరియు ఇండియా పోస్ట్ ’’

ఇండియా పోస్ట్ మరియు ఐథింక్ లాజిస్టిక్స్ మధ్య వ్యూహాత్మక సహకారం భారతదేశం అంతటా డి2సి స్టార్టప్స్ మరియు ఎస్ ఎం బి ల కోసం ఇ-కామర్స్ చివరి అంచె డెలివరీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఇండియా పోస్ట్ యొక్క విస్తృతమైన పరిధిని వినియోగించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

అక్టోబరు 2023: అధునాతన లాజిస్టిక్స్ టెక్నాలజీలో అగ్రగామి, భారతదేశంలోని ప్రముఖ షిప్పింగ్ ప్లాట్‌ ఫామ్‌లలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ దేశంలోని ప్రధాన పోస్టల్ నెట్‌వర్క్ అయిన ఇండియా పోస్ట్ తో చేతులు కలిపింది. ఈ కూటమి చివరి అంచె డెలివరీ ల్యాండ్‌స్కేప్‌ను పునర్నిర్మించడానికి హామీ ఇచ్చే చరితాత్మక సాంకేతిక సమ్మేళనానికి ఇది దారి తీస్తుంది. భారతదేశం అంతటా డైరెక్ట్-టు- కన్సుమెర్ (డి2సి) స్టార్టప్స్ మరియు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ (ఎస్ ఎంబీస్)లకు అపారమైన ప్రయోజనాలను తీసుకురావడానికి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం చోటు చేసుకుంది.

ఈ సహకారం గుండెకాయ డి2సి వ్యాపారాలు పట్టణ కేంద్రాలకు మించి విస్తరించడానికి వాటికి సాధికారికత క ల్పించాలనే భాగస్వామ్య లక్ష్యంలో ఉంది. 2022లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇ-కామర్స్ చొచ్చుకు పోయే రేట్లు వరుసగా 21.4% మరియు 41.5% వద్ద ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో వంటి మార్కెట్ దిగ్గజాలు ఈ ప్రాంతాలలో బలమైన స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి. స్వతంత్ర ఇ-కామర్స్ బ్రాండ్‌లు పరిమిత సేవా సామర్థ్యం  సవాలుతో తరచుగా కష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఐథింక్ లాజిస్టిక్స్ అత్యాధునిక సాంకేతికత, ఇండియా పోస్ట్ విస్తృతమైన చేరువ కలయిక ఈ సవాలును నేరుగా ఎదుర్కొంటుంది ఐథింక్ లాజిస్టిక్స్ అధునాతన సాంకేతికత, వేగవంతమైన సేవలతో దేశంలోని మారు మూల ప్రాంతాలలో కూడా ఇండియా పోస్ట్ అసమానమైన పరిధిని కలపడం ద్వారా, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ విప్లవాత్మకమైన పరివర్తనకు లోనవుతాయి. నేటి వేగవంతమైన వ్యాపార వాతావరణంలో డి2సి కంపనీస్ అభి వృద్ధి చెందడానికి ఈ రెండు కీలక అంశాలు కీలకం.

 “ఇండియా పోస్ట్ తో ఈ సంచలనాత్మక భాగస్వామ్యం గురించి మేం నిజంగా సంతోషిస్తున్నాము. మా సహకారం అనేది ఆశయం, వినూత్నత కలయికకు ప్రతీక. ఇక్కడ మేం సాంకేతిక శక్తిని, ఇండియా పోస్ట్ విస్తృతమైన పరిధిని ఉపయోగించి డైరెక్ట్-టు-కన్స్యూమర్ స్టార్టప్స్ మరియు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ను లాజిస్టికల్ ఉత్కృష్ట  కొత్త యుగంలోకి నడిపించాం. ఈ భాగస్వామ్యంతో మేం భౌగోళిక అంత రాలను పూడ్చ డం మాత్రమే కాకుండా, ఇ-కామర్స్ పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించడానికి, ఉత్పత్తులను కస్టమర్‌లకు చేరే విధా నాన్ని మార్చడానికి, కస్టమర్ అనుభవాలను పునర్నిర్వచించడానికి అన్ని పరిమాణాల వ్యాపారాలకు సాధి కారత కల్పిస్తున్నాం. – మిసెస్. జైబా సారంగ్, కో-ఫౌండర్ ఐథింక్ లాజిస్టిక్స్.

 ఈ అమరిక యొక్క అత్యుత్తమ అంశం ఏమిటంటే ఆర్థికంగా డెలివరీలను సృష్టించగల సామర్థ్యం, ప్రత్యేకించి తక్కువ అభివృద్ధి చెందిన లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో. ఇండియా పోస్ట్ అనుభవం, విస్తృత శ్రేణి నెట్‌వర్క్ అనేది ఐ థింక్ లాజిస్టిక్స్ సాంకేతిక సామర్థ్యాలకు ఆశాజనక సామర్థ్యం, విశ్వసనీయత ,  మెరుగైన కస్టమర్ సంతృప్తిలకు పూరకంగా ఉంటుంది.    

సరుకుల పరిమాణం పెరిగేకొద్దీ, ‘విస్ మో’ (నా ఆర్డర్ ఎక్కడ ఉంది?) వంటి లాజిస్టికల్ సంబంధిత ప్రశ్నల సంభావ్యత కూడా పెరుగుతుంది. ఇది కొనుగోలుదారులకు కొనుగోలు అనంతర ఆందోళనను కలిగిస్తుంది. ఈ సందర్భంలో ఐ థింక్ లాజిస్టిక్స్ అధునాతన సాంకేతికత కీలకమైనది. కస్టమర్ మద్దతుకు చురుకైన విధా నాన్ని సులభతరం చేస్తుంది మరియు మొత్తం షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

“ఇండియా పోస్ట్ ఈ పరివర్తన ప్రయత్నంలో ఐ థింక్ లాజిస్టిక్స్ తో చేతులు కలపడం చాలా గర్వంగా ఉంది. మా సేవా వారసత్వం దశాబ్దాలుగా నిర్మించబడింది, ఐ థింక్ లాజిస్టిక్స్ ఫార్వర్డ్-థింకింగ్ సాంకేతిక నైపుణ్యంతో కలిపి, లాజిస్టిక్స్ పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ సహకారం అనేది సంప్రదాయం,  ఆవిష్కరణల కలయిక.   ఇది భారతదేశంలోని ప్రతి టచ్ పాయింట్‌ను చేరుకోవడానికి ఉత్తేజకరమైన కొత్త అవకాశాలను తె రుస్తుంది. మా దేశవ్యాప్త నెట్‌వర్క్, దేశమంతటా విస్తరించి ఉంది. ఇది ఐ థింక్ లాజిస్టిక్స్ అత్యాధునిక పరి ష్కారాలకు అనువైన పూరకంగా ఉంటుంది.శ్రీ అమితాబ్ సింగ్, పిఎమ్జి, మేల్స్ అండ్ బిడి, మహారాష్ట్ర పోస్టల్ సర్కిల్ పిఎంజి, ఇండియా పోస్ట్ 

ఇండియా పోస్ట్ మరియు ఐ థింక్ లాజిస్టిక్స్ ల మధ్య ఈ మైలురాయి సహకారం దేశవ్యాప్తంగా చివరి అంచె డెలివరీ ఆపరేషన్స్ ఆప్టిమైజ్ చేయడానికి రెండు సంస్థల బలాన్ని పెంచుతూ ఒక ముఖ్యమైన దశను సూచి స్తుంది. మెరుగైన ప్రాప్యత, ఆపరేషనల్ ఎఫిషియన్సి, అసమానమైన కస్టమర్ అనుభవాలపై దృష్టి సారించడం తో, ఈ భాగస్వామ్యం అభివృద్ధి చెందుతున్న ఇకామర్స్ ల్యాండ్‌స్కేప్‌లో డి2సి స్టార్టప్స్ మరియు ఎస్ ఎంబిల వృద్ధిని ఉత్ప్రేరకపరిచేందుకు రంగం సిద్ధం చేసింది.