లిప్‌స్టిక్ ఆఫ్ ఇండియాను ఆవిష్కరించిన స్విస్ బ్యూటీ

● భారతీయ చర్మపు రంగుల కోసం 30 బహుముఖ ఛాయలను అందిస్తున్న లిప్‌స్టిక్

● భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ12-గంటల పాటు నిలిచిఉండేలా, లిప్‌స్టిక్ వాటర్‌ప్రూఫ్ & ట్రాన్స్‌ ఫర్ ప్రూఫ్‌గా కూడా ఉంటుంది, రోజంతా మచ్చలేని విధంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. 

● లిప్‌స్టిక్ అప్రికాట్ ఆయిల్ & విటమిన్ ఇతో తిరుగులేని హైడ్రేషన్ ను అందిస్తుంది

● కొత్త లిప్‌స్టిక్ శ్రేణి ట్రయల్, మినీ ప్యాక్‌లలో కూడా అందుబాటులో ఉంది.

● కస్టమర్‌లు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

Video Campaign Link – https://youtu.be/gfE2-5woR6U?si=_LzP59e18SpijqA3

 ప్రముఖ భారతీయ కలర్ కాస్మెటిక్స్ బ్రాండ్, స్విస్ బ్యూటీ, ఈ సంవత్సరంలో తన అతిపెద్ద ఆవిష్కరణ అయిన ది హోల్డ్ మీ మ్యాట్ లిక్విడ్ లిప్‌స్టిక్‌ను ది లిప్‌స్టిక్ ఆఫ్ ఇండియాగా ఆవిష్కరించింది. భారతీయ చర్మం కోసం భారత దేశంలో తయారు చేయబడిన ఈ లిప్‌స్టిక్ తిరుగులేని లక్షణాల జాబితాతో, డబ్బుకు అసమానమైన విలువతో లిప్‌స్టిక్ ప్రమాణాలను పునర్నిర్వచించటానికి హామీ ఇస్తుంది.

 నాన్-డ్రైయింగ్ మ్యాట్ ఫినిషింగ్, విటమిన్ ఇ, ఆప్రికాట్ ఆయిల్‌తో ముమ్మర హైడ్రేషన్, 12 గంటల భారతీయ వాతావర ణానికి సరిపోయినట్లుగా ఉండే ‘ది లిప్‌స్టిక్ ఆఫ్ ఇండియా 30 అందమైన షేడ్స్‌ లో వస్తుంది. దీని విలాసవంతమైన ఆకృతి రోజంతా ఉంటుంది. సరిలేని మాట్టే ఫినిష్ ను అందించడానికి ఇది చాలా శ్రద్ధాసక్తులతో రూపొందించబడింది. వీటితో పాటు, ఈ ఉత్పాదన చర్మవ్యాధిపరంగా కూడా పరీక్షించబడింది.  ఈ బ్రాండ్ పెటా సర్టిఫైడ్ యానిమల్ టెస్ట్-ఫ్రీ. అది హోల్డ్ మీ మ్యాట్ లిప్‌స్టిక్‌ను సురక్షితమైన ఎంపికగా మార్చింది. కేవలం రూ.429 ధర వద్ద, కొత్తగా ప్రారంభించబ డిన లిప్‌స్టిక్ శ్రేణి కొల్లగొట్టడంతో సమానమైంది, అందం కోరుకునేవారికి ఇది సరసమైన లగ్జరీ.

 లిప్‌స్టిక్ శ్రేణి స్విస్ బ్యూటీ అధికారిక వెబ్‌సైట్, Nykaa, Amazon, Purplle, Myntra, అనేక ఇతర మార్కెట్‌ప్లేస్‌లలో అందుబాటులో ఉంది. బ్రాండ్ యొక్క అభిమానులు సెలబ్రేషన్స్ మాల్ (ఉదయపూర్) & ఎలాంటే మాల్ (చండీగఢ్‌)లోని బ్రాండ్ ఈబీఓలలో, పది భారతీయ నగరాల్లోని రిటైల్ స్టోర్‌లలో కూడా ఈ ఉత్పాదనని షాపింగ్ చేయవచ్చు. బ్రాండ్ త్వరలో ఇతర మార్కెట్‌ప్లేస్‌లు, భౌగోళిక ప్రాంతాలకు కూడా విస్తరించాలని ప్లాన్ చేసింది.

స్విస్ బ్యూటీ ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన ట్రయల్, మినీ ప్యాక్‌లను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ‘హోల్డ్ మీ మ్యాట్’ లిప్‌స్టిక్ మినీ ప్యాక్‌లు సంస్థ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 3 మినీల ది హోల్డ్ మీ మ్యాట్ లిప్‌స్టిక్‌తో కూడిన ట్రియో ప్యాక్ మార్కెట్‌ప్లేస్‌లు, వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ చర్య కస్టమర్‌లు పూర్తి-పరిమాణం లోని వాటిని కొనేందుకు ముందు బహుళ షేడ్స్‌ ను ట్రై చేయడానికి,  అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.

 ఈ తాజా ఆవిష్కరణతో, స్విస్ బ్యూటీ తన ప్రస్తుత శ్రేణి 1500 ఎస్ కేయూలకు మరో ఉత్పత్తిని జోడించింది. బ్రాండ్   లిప్‌స్టిక్ శ్రేణి భారతదేశం అంతటా, వివిధ వయసుల, ప్రాంతాల వినియోగదారుల నుండి అపారమైన వృద్ధిని, ప్రేమను చూసింది.  హోల్డ్ మీ మ్యాట్ లిప్‌స్టిక్‌ను ప్రారంభించడంతో, ఈ బ్రాండ్ ప్రతి మేకప్ ప్రేమికులకు వారి వయస్సు, నగరం, చర్మం రంగు, శరీర ఆకృతి లేదా జాతి అనే దానితో సంబంధం లేకుండా ఇంటింటా వినిపించే పేరుగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. లిక్విడ్ లిప్‌స్టిక్‌ల అందమైన బోల్డ్, సున్నిత రంగులు బలం, శక్తిని సూచిస్తాయి, ప్రతి మేకప్ ప్రేమికురాలిని కూడా వారి చర్మంపై నమ్మకంగా ఉండమని ప్రోత్సహిస్తాయి.

స్విస్ బ్యూటీ సీఈఓ సాహిల్ నాయర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ సంవత్సరంలో మా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆవిష్కరణ అయిన ‘హోల్డ్ మీ మ్యాట్’ లిప్‌స్టిక్ శ్రేణిని అందించడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. ఈ విప్లవాత్మక సే కరణ అనేది భారతీయ మేకప్ ప్రియుల కోసం క్యూరేటెడ్ ఉత్పత్తులను తీసుకురావడంలో మా నిబద్ధతకు నిదర్శనం. అ ది వారి అవసరాలను తీరుస్తుంది. దీనిని ‘ది లిప్‌స్టిక్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ ఉత్పత్తి భారతీ య స్కిన్ టోన్‌లు, ఇష్టాలు, అయిష్టాలు, విభిన్న వాతావరణ పరిస్థితులు, హైడ్రేషన్, పేఆఫ్  లాంటి వాటిని దృష్టిలో ఉంచు కొని భారతీయ మేకప్ ప్రేమికులు నిజంగా కోరుకుంటున్నారు అని అన్వేషించి రూపొందించబడింది. 30 ఆకర్ష ణీయమైన షేడ్స్, దీర్ఘకాలం ఉండే మాట్టే ఫినిష్, ముమ్మర హైడ్రేషన్‌తో, ‘హోల్డ్ మీ మ్యాట్’ కేవలం లిప్‌స్టిక్ కంటే ఎక్కువ; ఇది భారతదేశం అంతటా బలం, విశ్వాసం రూపాంతర ప్రయాణాన్ని సూచిస్తుంది. మేము బహుళ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రిటైల్ దుకాణాలలో ఆవిష్కరించిన ఈ లిప్‌స్టిక్ శ్రేణి ప్రతిచోటా మేకప్ ప్రియులకు అందం సాధికారతకు చిహ్నంగా మారుతుంద ని మేం నమ్ముతున్నాం’’ అని అన్నారు.