సెంచరీ మ్యాట్రెస్ హైబ్రిడ్ జెల్ లాటెక్స్ మ్యాట్రెస్ ఆవిష్కరణ
- కొత్తగా ఆవిష్కరించబడిన మ్యాట్రెసెస్ – హైబ్రిడ్ జెల్ లాటెక్స్ 18 సైజులలో వస్తుంది, ఇది వివిధ రకాల మందం మరియు దృఢత్వం కలిగి ఉంటుంది
- ప్రారంభ శ్రేణి రూ. 19,500
హైదరాబాద్, ఆగస్ట్ 2023: దక్షిణ భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే లక్ష్యంతో, భారతదేశంలోని ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్, సెంచరీ మ్యాట్రెస్, దాని హైబ్రిడ్ కలెక్షన్: జెల్ లాటెక్స్ మ్యాట్రెస్‌కి మరొక కొత్త రకాన్ని జోడించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పార్టనర్ కనెక్ట్ మీట్‌లో ఈ ఆవిష్కరణ జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఆగస్ట్ 7 నుండి ఆగస్టు 9, 2023 వరకు ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెంచరీ డీలర్‌లను ఒకచోట చేర్చింది, వారికి కొత్త పథకాలపై వివరాలను అందించింది మరియు వారి విజయాలను అవార్డులతో గుర్తించింది. శ్రీమలానీ గ్రూప్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ పురుషోత్తమ్ మలానీ ద్వారా మ్యాట్రెస్ విడుదల వేడుకను ప్రారంభించారు.
సృజనాత్మకత, అలాగే టెక్నాలజీలో అగ్రగామియైన సెంచరీ మ్యాట్రెస్ వివిధరకాల, మందంతో మరియు దృఢత్వంతో 18 సైజులలో అందుబాటులో ఉన్న జెల్ లాటెక్స్ మ్యాట్రెస్‌ను పరిచయం చేసింది. ఈ జెల్ లాటెక్స్ మ్యాట్రెస్, సరియైన శ్వాసక్రియ మరియు అనుకూలతతో ప్రీమియం క్వాలిటీ ల్యాటెక్స్ తో తయారు చేయబడింది.
శ్రీమలానీ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పురుషోత్తం మలానీ మాట్లాడుతూ, “ఈరోజు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. తాజా ఆవిష్కరణలు మా అమూల్య కస్టమర్‌లకు అసమానమైన నిద్ర అనుభవాలను అందించడంలో మా తిరుగులేని నిబద్ధతను గుర్తు చేస్తాయి. మేము ఆవిష్కరించే ప్రతి కొత్త ప్రొడక్ట్, మా అంకితభావాన్ని ప్రదర్శిస్తూ, మా కస్టమర్‌ల పెరుగుతున్న అవసరాలు మరియు ప్రాధాన్యతలపై మా లోతైన అవగాహన కూడా కలిగిస్తుంది. తాజా సాంకేతికత మరియు అత్యుత్తమ మెటీరియల్‌ని ఉపయోగించి ఖచ్చితత్వంతో రూపొందించబడి, ఈ కొత్త ఆఫర్ లు నిండిన, ఉన్నతమైన సౌలభ్యం, సుఖమైన నిద్ర మరియు శ్రేయస్సు కోసం మేము పడే తపనను నిరూపిస్తాయి. ప్రజలకు సుఖమైన నిద్రకు వీలుకల్పించాలనే మా లక్ష్యాన్ని మేము ఖచ్చితంగా పాటిస్తాము, ప్రతి ఉదయం వారు ఉత్తేజం, ఉల్లాసంతో నిద్రలేవాలని, ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఏవైనా సవాళ్ళను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సుఖమైన నిద్రకు వీలుకల్పించే పరిస్థితులను మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము.” అని అన్నారు.
200+ బ్రాండ్ స్టోర్‌లు మరియు 400+ అవుట్‌లెట్‌లతో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో సెంచరీ మ్యాట్రెస్ నంబర్ 1 మ్యాట్రెస్ బ్రాండ్ గా నిలిచింది. ఇది భారతదేశంలోని 450+ బ్రాండ్ స్టోర్‌లు మరియు 4500+ అవుట్‌లెట్‌లలో కూడా ఉంది. 2025 నాటికి, బ్రాండ్ కనీసం 100 విశిష్టమైన స్పెషల్ ఎక్స్ పీరియన్స్ స్టోర్‌లకు విస్తరించాలనుకుంటోంది.