భారతీయుల్లో 37% మంది క్రిప్టో కరెన్సీలను “డబ్బు భవిష్యత్తు”గా అన్నారు – క్రిప్టో మరియు వెబ్3పై గ్లోబల్ సర్వే

అంతర్లీన వెబ్3 కాన్సెప్ట్‌ లకు మద్దతును, విస్తృత విద్య కోసం ఒక అవకాశాన్ని వెల్లడిస్తున్న

కాన్సెన్సిస్ క్రిప్టో మరియు వెబ్3పై గ్లోబల్ సర్వే” 

  • ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తాము ఆన్‌లైన్‌లో ఉండేందుకు, విలువైన సహకారాన్ని అందిస్తున్నామని వి శ్వసించడానికి ప్రేరేపించబడ్డారని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వెబ్3 ద్వారా వర్గీకరించబడిన విధంగా, క్రియాశీల భాగస్వామ్యం, సాధికారత, విస్తృత కమ్యూనిటీ యాజమాన్యం వైపు వినియోగదారు ప్రవ ర్తనలో మార్పును ఈ పరిణామం సూచిస్తుంది.
  • అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియాలోని 15 దేశాల నుండి 18 నుండి 65 సంవత్సరాల వయస్సు గ ల మొత్తం 15,158 మంది వ్యక్తులు కాన్సెన్సిస్‌చే నియమించబడిన అంతర్జాతీయ ఆన్‌లైన్ రీసెర్చ్ డే టా అండ్ అనలిటిక్స్ టెక్నాలజీ గ్రూప్ YouGov  ద్వారా నిర్వహించబడిన, ఈ తరహాలో మొదటిదైన సర్వేలో పాల్గొన్నారు. సర్వే ఉద్దేశం వెబ్3, క్రిప్టో, ప్రస్తుత ఇంటర్నెట్ పట్ల అభిప్రాయాలను సేకరించడం, ప్రవర్తనలను మదింపు వేయడం.
  • సర్వేకు స్పందించిన భారతీయ నివాసులలో, 75% మంది ఇంటర్నెట్‌లో తమ గుర్తింపుపై మరింత ని యంత్రణను కలిగి ఉండాలనుకుంటున్నారు. వెబ్3 (41%),  ఎన్ఎఫ్టీ (42%) కంటే మెటావర్స్ (53%) భారతీయులకు బాగా సుపరిచితం.
  • అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా, కన్సెన్సిస్ ఒక ప్రధాన సందేశంతో అభివృద్ధి చెందిన బ్రాండ్‌ను ప్రారంభిస్తోంది. ఇది  ప్రతి ఒక్కరినీ కలుపుకొని పునర్నిర్వచించబడుతుంది, వెబ్ 3 నమూనా మార్పు మనందరికీ ఎలా శక్తినిస్తుందనే దానిపై కొత్త దృక్కోణాలను ప్రోత్సహిస్తుంది.

న్యూదిల్లీ, జూన్ 27, 2023— ఈరోజు ప్రముఖ వెబ్3 సాఫ్ట్‌ వేర్ టెక్నాలజీ కంపెనీ కాన్సెన్సిస్‌ అంతర్జాతీయ ఆన్‌ లైన్ రీసెర్చ్ డేటా అండ్ అనలిటిక్స్ టెక్నాలజీ గ్రూప్, YouGov ద్వారా క్రిప్టో, వెబ్3పై ఆన్‌లైన్‌లో నిర్వహించబ డిన మొట్టమొదటి ప్రపంచ అభిప్రాయ సర్వేను ఆవిష్కరించింది. ఆఫ్రికా, అమెరికా, యూరప్, ఆసియాలోని 15 దేశాల్లో ఏప్రిల్ 26 నుంచి మే 18, 2023 మధ్య 18-65 సంవత్సరాల మధ్య వయస్సు గల 15,158 మంది వ్య క్తుల  ప్రాతినిథ్య నమూనాను సర్వే చేశారు, ఇందులో భారతదేశం నుంచి 1013 మంది ఉన్నారు. ఈ సర్వే ఫలి తాలు వెబ్3, క్రిప్టో పర్యావరణ వ్యవస్థపై ప్రజల అవగాహన, వీక్షణలపై ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన దృక్పథాల ను అందిస్తాయి. భారతదేశం నుండి పాల్గొనే వారితో నిర్వహించిన సర్వే డేటా గోప్యత, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, ఇటీవలి వార్తల చక్రం, డిజిటల్ యాజమాన్యం వంటి అంశాలను పరిశీలిస్తుంది. స్పందిం చిన భారతీయుల్లో 37% మంది క్రిప్టో కరెన్సీలను “డబ్బు భవిష్యత్తు”గా మరియు 31% మంది “డిజిటల్ యా జమాన్య భవిష్యత్తు”, “ప్ర పంచ ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో పాల్గొనడానికి ఒక మార్గం”గా చూస్తున్నారని ఫలి తాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం వెబ్3 ద్వారా వర్గీకరించబడిన క్రియాశీల భాగస్వామ్యం, సాధికారత, విస్తృత కమ్యూనిటీ యాజ మాన్యం వైపు వినియోగదారు ప్రవర్తనలో మార్పును సూచి స్తుంది.

 “యూజర్స్” నుండి “బిల్డర్స్” వరకు: ధోరణిలో మార్పు – భారతీయ మార్కెట్

 సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో-నేతృత్వంలోని భవిష్యత్తుపై విశ్వాసంతో కూడిన భారతీయ మార్కెట్‌కు సంబంధించిన అద్భుతమైన చిత్రాన్ని అందించాయి:

  • బలమైన క్రిప్టో అవగాహన: 92% మంది పాల్గొనేవారు క్రిప్టోపై అవగాహనను ప్రదర్శించారు;
  • క్రిప్టో భవిష్యత్తుపై దృఢమైన నమ్మకాలు: క్రిప్టోతో అనుబంధించబడిన ప్రధాన భావనల గురించి అడిగిన ప్పుడు స్పెక్యులేషన్ (17%) లేదా స్కామ్‌లు (20%) అని భావించిన వారితో పోలిస్తే, పరిశ్రమతో పరిచయం ఉన్నవారిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది డబ్బు  భవిష్యత్తు (37%),  డిజిటల్ యాజమాన్యం భవిష్యత్తు (31%) వంటి దాని సంభావ్యతను విశ్వసించారు.   
  • క్రిప్టో యాజమాన్యం: జనాభాలో ఐదో వంతు ప్రస్తుతం కొంత క్రిప్టోకరెన్సీని కలిగి ఉన్నారు, 57% మంది భారతీయ రెస్పాండెంట్స్ వచ్చే 12 నెలల్లో క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. అలాగే, 57% మంది రెస్పాండెంట్స్ క్రిప్టో అనేది పర్యావరణ అనుకూల సాంకేతికత అని నమ్ముతున్నారు.
  • ఉత్తర-మధ్య & తూర్పు ప్రాంతాలు ఆధిపత్యం: భారతదేశంలో  ఉత్తర, మధ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు (94%) క్రిప్టోకరెన్సీల కోసం అత్యధిక అనుబంధాన్ని చూపుతాయి, ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ (92%) దక్షిణ (89%) ప్రాంతాలు ఉన్నాయి.
  • డేటా గోప్యత గురించిన ఆందోళనలు: సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది డేటా గోప్యతను ముఖ్యమైనదిగా భావించారు. 53% మంది ఇంటర్నెట్‌లో తమ గుర్తింపుపై మరింత నియంత్రణను కలిగి ఉండాలనే కోరికను వ్యక్తం చేశారు. 39% మంది తమ డేటా నుండి కంపెనీ సంపాదించే లాభంలో వాటాను కలిగి ఉండాలని విశ్వసించారు. 30% మంది మాత్రమే తమ డేటా, వ్యక్తిగత సమాచారంతో ప్రస్తుత ఇంటర్నెట్ సేవలను విశ్వసించారు.
  • క్రిప్టో ఆవరణ వ్యవస్థలోకి ప్రవేశించడానికి అడ్డంకులు: మార్కెట్ అస్థిరత (48%), స్కామ్‌ల భయం (44%) ప్రవేశానికి అత్యంత ముఖ్యమైన అడ్డంకులుగా ఉన్నాయి. ఆవరణ వ్యవస్థ సంక్లిష్టత (36%), దాని ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

YouGov   పూర్తి గ్లోబల్ రిపోర్ట్ అలాగే దేశ-స్థాయి ఎగ్జిక్యూటివ్ సారాంశాలు అందుబాటులో ఉన్నాయి HERE.

 ఆన్‌లైన్ గుర్తింపు, తాము పంచుకునే డేటాపై మరింత నియంత్రణ, అదే విధంగా తమ సహకారాలకు గాను   ప్లాట్‌ఫామ్‌ రూపకర్తల నుంచి మరింత సమానమైన లాభాల భాగస్వామ్యంపై కోసం పెరుగుతున్న ప్రధాన స్ర వంతి కోరికను సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ప్రపంచంలో వెబ్3,  క్రిప్టోలు  వ్యక్తులను శక్తివంతం చేసే గ్లోబల్ పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌ ను ప్రారంభిస్తాయి. గుర్తింపు నియంత్రణను థర్డ్ పార్టీల నుండి వ్యక్తికి మార్చ డం ద్వారా, విలువ సృష్టి, సమాజ నిర్మాణంలకు సంబంధించి కొత్త నమూనాలను ఏర్పాటు చేయడం ద్వారా వెబ్3 ఈ కోరికలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. సాఫ్ట్‌ వేర్‌ను అభివృద్ధి చేయడం, క్రిప్టో-ఆస్తులను కలిగి ఉండడం లేదా ఎన్ఎఫ్టీలను సృష్టించడం లేదా కొనుగోలు చేయడం వంటివి చేస్తూ, క్రిప్టో, వెబ్3తో నిమగ్నమ య్యే వ్యక్తులు,  సాధారణంగా నిర్వచించే ‘వినియోగదారు’ కంటే ఎక్కువ స్థాయిలో ఉంటారు కానీ నేరుగా తమ కమ్యూనిటీలు, ఆవరణ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడతారు.

బిల్డర్ సాధికారతను తన ఉద్దేశ్యానికి ప్రాథమికమైనదిగా కాన్సెన్సిస్ చూస్తుంది. వెబ్ 3 సంభావ్యతను, వారి జీ వితంలో అది పోషించగల పాత్రను, వారు ప్రారంభించడానికి అవసరమైన సాధనాలను చూడటానికి ప్రతిచోటా వ్యక్తులకు మద్దతు ఇవ్వడంపై కాన్సెన్సిస్ దృష్టి సారించింది. నేడు, కాన్సెన్సిస్ అభివృద్ధి చెందిన బ్రాండ్ గుర్తిం పును వెల్లడిస్తుంది. ఇది వ్యక్తులు తమను, ప్రపంచాన్ని విభిన్నంగా చూసేలా ప్రోత్సహిస్తుంది: కళాకారు లు, కమ్యూనిటీ సృష్టికర్తలు, సేకర్తలు, చివరికి ప్రతి ఒక్కరినీ మరింత కలుపుకొని ఉండేలా “బిల్డర్”ని రీఫ్రేమ్ చేస్తుం ది. కన్సెన్సిస్ బ్రాండ్ పరిణామం గురించి మరిన్ని వివరాలను HERE చూడవచ్చు.

కాన్సెన్సిస్ వ్యవస్థాపకుడు, సీఈఓ జో లుబిన్ మాట్లాడుతూ, “యూజర్‌లు, కమ్యూనిటీలకు అధికారం ఇచ్చే వికేంద్రీకృత విశ్వాస నమూనా ఆవిర్భావాన్ని సర్వే నిర్ధారిస్తుంది. బిల్డర్ యుగం వెబ్3 విలువలకు అనుగుణ్యం గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటును అందించవచ్చు. బిల్డర్లు, డెవలపర్‌లకు విశ్వసనీయ మైన స్టీవార్డ్‌ గా ఉండటమే కాన్సెన్సిస్ లక్ష్యం, కమ్యూనిటీ సాధికారత, సానుకూల ప్రపంచ ప్రభావానికి ఇది మద్దతు ఇస్తుంది’’ అని అన్నారు.

వెబ్3 అవగాహనలో దేశాల మధ్య తేడాలు

వివిధ ప్రాంతాల యొక్క తులనాత్మక విశ్లేషణ వెబ్3, క్రిప్టో-సంబంధిత అంశాలలో వివిధ దేశాల మధ్య ఆసక్తికర మైన వ్యత్యాసాలను వెల్లడిస్తుంది:

  • క్రిప్టోను సొంతం చేసుకునేందుకు ప్రేరణలు: నైజీరియా (65%),  అర్జెంటీనా (56%) తమ స్థానిక కరె న్సీల అస్థిరత కారణంగా, విలువను నిల్వ చేయడానికి క్రిప్టోకరెన్సీలను సొంతం చేసుకునేందుకు అత్య ధిక ప్రేరణను చూపుతున్నాయి; భారతదేశంలో (43%) దీనిని భవిష్యత్తు కోసం పెట్టుబడిగా భావిస్తారు
  • తాము ఇంటర్నెట్‌కు విలువను జోడించడంపై నమ్మకాలు: సర్వేలో పాల్గొన్న వారిలో, నైజీరియాలో 67% మంది,  భారతదేశంలో 60% మంది తాము ఇంటర్నెట్‌కు విలువను జోడించామని గట్టిగా విశ్వ సిస్తారు, జపాన్‌లో   కేవలం 5% మాత్రమే ఇలా భావిస్తారు;
  • NFT యాజమాన్యం: సర్వేలో పాల్గొన్న వారికి సంబంధించి, ఎన్ఎఫ్టీ ల భావనతో సుపరిచితమైన వారి లో, యూకేలో 76% మంది   ఎప్పుడూ ఎన్ఎఫ్టీ ని కలిగి లేరు, వియత్నాంలో కేవలం 24% మంది మాత్రమే ఎన్ఎఫ్టీని కలిగిఉన్నారు.; భారతదేశంలో 39% మంది ఎన్ఎఫ్టీలను కలిగి ఉన్నారు
  • డబ్బు యొక్క భవిష్యత్తు: 58% నైజీరియన్లు, 50% దక్షిణాఫ్రికన్లు, 44% మెక్సికన్లు క్రిప్టోకరెన్సీలతో ముడిపడి ఉన్న ప్రధాన భావనలలో డబ్బు భవిష్యత్తు ఒకటని చెప్పారు, అయితే కేవలం 18% భారతీ యులు, 15% బ్రిట్స్, 17% జర్మన్లు అదే జవాబు చెప్పారు;
  • స్కామ్‌ల గురించిన ఆందోళనలు: జపాన్, కొరియాతో పోలిస్తే భారతదేశం (44%), అమెరికా (19%),  యూకే (20%) స్కామ్‌ల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు (ఒక్కొక్కటి 12%);
  • క్రిప్టో కార్బన్ ముద్ర: సర్వేలో పాల్గొన్న వారిలో 57% భారతీయలు, బ్రెజిలియన్లు క్రిప్టో పర్యావరణ అను కూల సాంకేతికత అని భావిస్తారు, ఫ్రాన్స్‌ లో కూడా 25% మంది మాత్రమే అలాగే భావిస్తున్నారు.