గ్యాస్ ధరలు తగ్గించకుంటే ఉద్యమిస్తాం – కాట్రగడ్డ

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుంటే మహిళ లోకం ఉద్యమిస్తుందని హెచ్చరించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్రా ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఇందుకు నిరసననగా సనత్ నగర్ నియోజకవర్గం, బేగంపేట డివిజన్ లో కట్టెల మూట నెత్తిన పెట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డుపై వంటవార్పు చేసి, ర్యాలీ నిర్వహించారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షకీలా రెడ్డి , మహిళా నాయకురాలు సూర్యదేవరలత, లీలా పద్మావతి , బేగంపేట డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ వాయిద్ , డివిజన్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ , రఫిక్ తన్వీర్,సయ్యద్ హమీద్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.