సికింద్రాబాద్ లో తన షోరూమ్ ప్రారంభించిన గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్
~పుణె డీలర్ షిప్ ప్రారంభం తరువాత రెండో షోరూమ్
(Eblu) ఇబ్లూ శ్రేణి ఉత్పాదనల రూపకర్త అయిన గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ తెలంగాణలోని సికింద్రాబాద్ లో తన తాజా షోరూమ్ ‘‘‘ఎస్ఎ మోటార్స్’ ను ప్రారంభించింది. ఇదిప్రపంచ స్థాయి సాంకేతికతతో, షోరూమ్ వినియోగదారులకు విభిన్నమైన ఈవీకొనుగోలు అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రాంతంలో ఈవీఅనుసరణ గురించి అవగాహనను పెంచుతుంది. షోరూమ్ 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. చిరునామాఇం.నెం: 6-R8-028, ప్లాట్ నెం. .1 సర్వే నెం: 6,7, హనుమాన్ దేవాలయం దగ్గర, చందు లాల్ బౌలి కాలనీ, తాడ్‌బండ్ రోడ్, సిఖ్ విలేజ్, సికింద్రాబాద్, తెలంగాణ – 500009.
ఈ షోరూమ్ ప్రధాన విశిష్టతఏమిటంటే, వినియోగదారులు గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ అందించే 3S సౌకర్యాలకు ప్రాప్యతను కలిగి ఉంటారు. షోరూమ్ ఈ బ్రాండ్ ప్రయాణాన్ని కూడా ప్రదర్శిస్తుంది. వినియోగదారుల ఎండ్-టు-ఎండ్ ఈవీఅవసరాలకు ఒకే టచ్ పాయింట్‌గా ఇది ఉంటుంది.
ఈ సందర్భంగా గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సీఈఓ – హైదర్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘”ఈ వారం ప్రారంభంలో మా మొదటి షోరూమ్ ప్రారంభోత్సవం తర్వాత, సికింద్రాబాద్ షోరూమ్‌తో దేశంలో మా ఉనికిని విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ముందుగా మా ఇబ్లూ శ్రేణి ఉత్పత్తులను ప్రారంభించడంతో ఈ నెలలో, మేం మా ఈవీరిటైల్ ప్రయాణాన్ని వ్యూహాత్మక నెట్‌వర్క్ విస్తరణతో ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఈ డీలర్‌షిప్ ప్రాంతంలోని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి నెలకొల్పబడింది. మేం భారతదేశం అంతటా మా ఉనికిని విస్తరించడంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తాం” అని అన్నారు.
ఎస్ఏ మోటార్స్ యజమాని – శశికాంత్ మాట్లాడుతూ, “మేం ఈ ప్రాంతంలో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్‌తో ఈ అనుబంధం కోసం ఎదురు చూస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ వ్యూహానికి సంబంధించి మేం పూర్తిగా కంపెనీ ఆశయానికి అనుగుణంగా ఉన్నాం. ఈ ప్రాంతం ఈవీ డిమాండ్లను తీర్చడానికి ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.
ఇటీవల ప్రారంభించిన ఇ-ఆటో (L5M) ఇబ్లూ రోజీ, మూడు వేరియంట్‌లలోఇ-సైకిల్ శ్రేణిఇబ్లూ స్పిన్ ఈ షోరూమ్ లో అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు షోరూమ్‌లోకి వచ్చి, ఈ ఉత్పాదనలను అనుభూతి చెందవచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులకు రుణ సౌకర్యాలను అందించడానికి గోదావరి ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలతో ఒప్పందం కుదుర్చుకుంది.