సొంత పార్టీలోనే దిక్కులేదు కానీ దేశాన్ని ఏలుతాడంట – కాట్రగడ్డ

సొంత పార్టీ నేతలను కాపాడుకోవాడినికే దిక్కలేదు కానీ దేశాని పాలించడానికి బయలుదేరుతున్నారని సీఎం కేసీఆర్ తనదైన శైలిలో విమర్శించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. ఖమ్మంలో భారస ఆవిర్భావ సభకు ముందే ఆ పార్టీలోని నాయకులు ఇతర పార్టీలోకి మారుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పెట్టిన సభ తరువాత రాజకీయ పరమైన మార్పులు జరిగాయన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో భారసకు ఎటువంటి పట్టు లేదని.. జిల్లాలోనే భారస దిక్కులేదన్నారు. దేశ రాజకీయాలు అని అనడం సీఎం కేసీఆర్ రాజకీయం కోసమేనని, తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసమేనని అన్నారు.