గుంటూరులో కుషల్స్ ఫ్యాషన్ జువెలరీ 50వ స్టోర్

భారతదేశపు అత్యుత్తమ ఫ్యాషన్ ఆభరణాల బ్రాండ్ కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ భారతదేశంలో తన 50 వ స్టోర్ ను గుంటూరులోని లక్ష్మీపురంలో హాలీవుడ్ బాలీవుడ్ థియేటర్ ఎదురుగా ప్రారంభించింది. ఈ స్టోర్‌ను మీడియా, యాజ‌మాన్యం సమక్షంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం శాఖ మాజీమంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత ప్రారంభించారు.

స్టోర్ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఇంకా మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లో స్టోర్ల త‌ర్వాత‌ ఆంధ్రలో ఇది కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ వారి 4వ స్టోరు. హైదరాబాద్ లో 9 స్టోర్లు ఉన్నాయి. 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ లో పురాతన, కుందన్, జిర్కాన్, టెంపుల్, కాంటెంపరరీ ఆభరణాలలో 10,000 కి పైగా డిజైన్లను ప్రదర్శిస్తున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా మేకతోటి సుచరిత మాట్లాడుతూ “ఈ స్టోర్, కలెక్షన్స్ చూస్తుంటే అది ఫ్యాషన్ జ్యువెలరీ స్టోర్ అని నేను నమ్మలేకపోయాను. కుషల్స్ గురించి నేను ఎక్కువగా ఇష్టపడే విషయం ఏమిటంటే, ఇక్క‌డ సాంప్రదాయ, ఆధునిక‌ డిజైన్ల నుంచి ట్రెండీ ఆధునిక డిజైన్ల వరకు అన్నిర‌కాల ఎంపికలు ఉన్నాయి. గుంటూరులోని ప్రతి మహిళ ఈ దుకాణాన్ని సందర్శించి ప్రదర్శనలో ఉన్న విస్తృత సేకరణలను చూడాలని నేను సిఫార్సు చేస్తున్నాను ” అన్నారు.

కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ డైరెక్టర్ తన్సుఖ్ రాజ్ గులేచా మాట్లాడుతూ , “ఈ ప్రత్యేక సందర్భంగా మాజీ మంత్రి మేకతోటి సుచరిత మాతో ఉండటం మాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మా 50వ స్టోర్ ని గుంటూరులో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్రప్ర‌దేశ్‌ ప్రజలు ఆభరణాలను ఇష్టపడతారు. వారికి స‌రికొత్త ట్రెండ్లు, ఫ్యాషన్ గురించి బాగా తెలుసు. మేము విస్తృత శ్రేణి భారతీయ ఫ్యాషన్ ఆభరణాలతో పాటు, దిగుమతి చేసుకున్న ఆభరణాల ప్రత్యేకశ్రేణితో ఒక సేకరణను రూపొందించాము. ఇది ఆంధ్ర, తెలంగాణలలో మా 13వ స్టోర్. రెండు రాష్ట్రాల నుంచి మాకు లభించిన అద్భుతమైన ప్రతిస్పందనతో మేము సంతోషిస్తున్నాము. ప్రత్యేకమైన, అధిక నాణ్యత కలిగిన డిజైనర్ ఫ్యాషన్ ఆభరణాలకు పెరుగుతున్న డిమాండును తీర్చగలమనే నమ్మకం మాకు ఉంది” అన్నారు.

క్లిష్టమైన కళానైపుణ్యంతో ప్రత్యేకమైన డిజైన్లకు ప్రసిద్ది చెందిన కుషల్స్ మహిళల కోసం ఫ్యాషన్ ఆభరణాలను పున‌రావిష్కరిస్తున్నందుకు ఎంతో గ‌ర్వ‌ప‌డుతోంది. ఈ బ్రాండ్ వారి బహుముఖ సంప్రదాయ, సమకాలీన డిజైన్లు, అసాధారణమైన ఉత్పత్తి నాణ్యత, గ్రాండియర్ స్టోర్లకు ప్రసిద్ది చెందింది. ఏ మహిళ అయినా స్టైలిష్ గా, ఫ్యాషనబుల్ గా ఉండగలదని విశ్వసించే కుషల్స్ సంప్రదాయ, ఫార్మల్ లేదా క్యాజువల్.. ఇలా అన్ని సందర్భాల్లో ఆభరణాలకు ఏకైక గమ్యస్థానం. ఈ సేకరణలో దైవిక సిల్వర్ టెంపుల్ ఆభరణాలు, కాలాతీతమైన‌ పురాతన ఆభరణాలు, ప్రకాశవంతమైన కుందన్ ఆభరణాలు, మెరిసే జిర్కాన్ ఆభరణాలు, ప్రభావవంతమైన ఆక్సిడైజ్డ్ వెండి, మరెన్నో విస్తృత శ్రేణి ఫ్యాషన్ ఆభరణాలు ఇక్క‌డ ఉన్నాయి.