చంద్రబాబు బిక్షతోనే కేసీఆర్ రాజకీయం – కాట్రగడ్డ

చంద్రబాబు నాయుడు పెట్టిన బిక్షతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారన్నారు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ అధికారంలో ఉన్న భారస పార్టీకి నూకలు చెల్లాయన్నారు.  తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారని, తెలంగాణ గడ్డపైనే టీడీపీ ఆవిర్భవించిందని ప్రస్తావించారు. తెలుగు జాతి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఎన్టీఆర్‌, రూ.2కే కిలో బియ్యం ఇచ్చి పేదల దృష్టి ఆకర్షించారని ప్రశంసించారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను నిర్మూలించారని, బడుగు, బలహీన వర్గాల కోసం గురుకుల పాఠశాలలను ప్రారంభించారని చంద్రబాబు గుర్తుచేశారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌ అని, ప్రపంచానికి దారి చూపే శక్తి తెలుగుజాతికి ఉందని టీడీపీ నిరూపించిందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తేవడం కోసం చాలా కష్టపడ్డానని, పదేపదే ప్రయత్నిస్తే బిల్‌గేట్స్ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, భారతీయ యువతతో ఏదేశానికీ పోటీ పడేశక్తి లేదని స్పష్టం చేశారు.  ఈ సభలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.